Rohit Sharma: తాజా ఐసీసీ వన్డే బ్యాటర్ల ర్యాంకింగ్స్‌లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ రెండో స్థానానికి ఎగబాకారు. ప్రస్తుతం ఆయన 756 రేటింగ్ పాయింట్లతో ఉన్నారు. ఈ స్థానానికి ఎగబాకడం ద్వారా పాకిస్తాన్ ఆటగాడు బాబర్ ఆజామ్‌ను మూడో స్థానానికి నెట్టారు. టీమిండియా టెస్టు కెప్టెన్ శుభ్‌మన్ గిల్ 784 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతున్నారు. టాప్ 5లో ముగ్గురు భారతీయ బ్యాటర్లు ఉండటం విశేషం. శుభ్‌మన్ గిల్ (1వ), రోహిత్ శర్మ (2వ), మరియు విరాట్ కోహ్లీ (4వ) స్థానాల్లో ఉన్నారు. వన్డే బౌలింగ్ ర్యాంకింగ్స్‌లో టీమిండియా బౌలర్ కుల్దీప్ యాదవ్ రెండో స్థానంలో, రవీంద్ర జడేజా 9వ స్థానంలో ఉన్నారు.
Also Read: IOA Approves Bid: 2030 కామన్వెల్త్ క్రీడల బిడ్‌కు అధికారికంగా ఆమోదం
రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఇటీవల కాలంలో అంతర్జాతీయ వన్డే మ్యాచ్‌లు ఆడనప్పటికీ, వారి మునుపటి ప్రదర్శనల కారణంగా ఈ ర్యాంకింగ్స్‌లో కొనసాగుతున్నారు. ఈ తాజా ర్యాంకింగ్స్ భారత క్రికెట్ జట్టుకు అంతర్జాతీయ స్థాయిలో ఉన్న పటిష్టతను తెలియజేస్తుంది. టీ20 బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ అగ్రస్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సూర్యకుమార్ యాదవ్‌కు ఆరో ర్యాంకు దక్కింది. జైస్వాల్ 11వ స్థానంలో ఉన్నాడు. బౌలర్ల ర్యాంకింగ్స్‌లో భారత్ నుంచి రవి బిష్ణోయ్ (7వ), అర్ష్‌దీప్ సింగ్ (9వ) టాప్-10లో ఉన్నారు. డఫి (న్యూజిలాండ్) నంబర్‌వన్ టీ20 బౌలర్.

