Yellamma: దర్శకుడు వేణు యెల్దండి నెక్స్ట్ ఎల్లమ్మ చిత్రంతో రీసౌండ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాడు. దిల్ రాజు బ్యానర్‌లో ఈ ప్రాజెక్ట్ రెడీ అవుతోంది. హీరో పేర్లు చాలా వినిపించాయి. నితిన్ ఓకే అయ్యి తప్పుకున్నాడు. మొన్నటిదాకా బెల్లంకొండ పేరు వినిపించగా, ఇప్పుడు రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ హీరోగా జాయిన్ అవుతున్నారని టాక్.
Also Read: Ramayana: రామాయణ: ఇంటర్నేషనల్ వేదికపై ట్రైలర్ లాంచ్?
బలగంతో దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న వేణు యెల్దండి తన స్కోర్‌ను పెంచుకోవాలని శ్రమిస్తున్నాడు. ఎల్లమ్మని అనౌన్స్ చేసి చాలా రోజులు అయ్యింది. అయితే హీరో విషయంపై ఇంతవరకు క్లారిటీ రాలేదు. చాలా పేర్లు వినిపించాయి. చివరకు బెల్లంకొండ శ్రీనివాస్ ఓకే అయ్యాడని టాక్ వచ్చింది. కానీ అతను కూడా తప్పుకున్నాడట. దీంతో చిత్రం ఆలస్యమవుతుందేమో అనుకున్నారు. కానీ మేకర్స్ ఊహలకు అందని విధంగా హీరోను ఫిక్స్ చేశారు. ఈ సినిమాకి టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ ని హీరోగా ఫిక్స్ చేశారని టాక్. కథ తనకు నచ్చడంతో దేవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఈ వార్త నిజమైతే అభిమానులు సంతోషంగా ఉప్పొంగిపోవడం పక్కా. అధికారిక ప్రకటన త్వరలో వస్తుందని టాక్. మొత్తానికి హీరోగా దేవి శ్రీ కెరీర్‌లో కొత్త అధ్యాయం మొదలవబోతుంది.