Road Accident:

Road Accident: రోడ్డు ప్ర‌మాదంలో టాలీవుడ్ న‌టుడి దుర్మ‌ర‌ణం

Road Accident: టాలీవుడ్ న‌టుడు, ప‌లు సినిమాల్లో విల‌న్ గ్యాంగులో క్యారెక్ట‌ర్ ఆర్టిస్టుగా గుర్తింపు పొందిన‌ బోర‌బండ భాను రోడ్డు ప్ర‌మాదంలో క‌న్నుమూశారు. ఏపీలోని గండికోట‌లో జ‌రిగిన ఓ మిత్రుడి ఆహ్వానంతో అక్క‌డికి వెళ్లిన భాను తిరుగు ప్ర‌యాణంలో జ‌రిగిన రోడ్డు ప్ర‌మాదంలో చ‌నిపోయారు. దీంతో టాలీవుడ్‌లో విషాద ఛాయ‌లు అలుముకున్నాయి.

Road Accident: బోర‌బండ భాను అనేక చిత్రాల్లో ప్ర‌తినాయ‌కుడి బృందంలో క‌నిపిస్తూ త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఓ మిత్రుడి ఆహ్వానంతో భాను నిన్న‌ గండికోట‌కు వెళ్లారు. అక్క‌డ స్నేహితుల‌తో క‌లిసి సంతోషంగా పార్టీలో పాల్గొన్నారు. ఆ వీడియోల‌ను, ఫొటోల‌ను ఇన్‌స్టాగ్రామ్‌లో సైతం పోస్టు చేశారు. తిరుగు ప్ర‌యాణంలో బొత్కూరు స‌మీపంలో ఆయ‌న ప్ర‌యాణిస్తున్న కారు ప్ర‌మాదానికి గురైంది. ఆ ప్ర‌మాదంలో భాను అక్క‌డిక‌క్క‌డే మృతిచెందారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *