Indian Cricket Team: ప్రపంచ క్రికెట్ లో ధనిక బోర్డు అంటే ఎలాంటి సందేహం లేకుండా బీసీసీఐ అని చెబుతారు. అఫ్ కోర్స్ అది నిజం కూడా.. ఏ క్రికెట్ బోర్డుకు లేనంత ఆదాయం మన భారత క్రికెట్ నియంత్రణ సంస్థ దగ్గర ఉందంటే అతిశయోక్తి కాదు. మరి మన క్రికెటర్ల ఆదాయం అంటే ..యెస్ ఇంటర్నేషనల్ క్రికెటర్లతో పోల్చుకుంటే మన క్రికెటర్ల ఆదాయం కూడా చాలా ఎక్కువ .. మరి మన దేశంలో అత్యధిక ఆదాయం ఆర్జించిన క్రికెటర్ ఎవరంటే ఆసక్తి కలగించే వివరాలు వెల్లడయ్యాయి. క్రిక్ బజ్ రిపోర్టు ప్రకారం బీసీసీఐ నెట్ వర్త్ ఇన్ కం సెప్టెంబర్ 2023 ఆర్థిక సంవత్సరానికి రూ. 6,558.80 కోట్లు. అంతకుముం 2022 ఏడాదిలో రూ. 4,360.57 కోట్ల సంపాదన ఉన్నట్లు తెలిపింది.
Indian Cricket Team: ఇక క్రికెటర్ల సంపాదన విషయంలోనూ కళ్లు చెదిరే గణాంకాలు వెలువడ్డాయి. ప్రస్తుత టీమిండియా టెస్టు కెప్టెన్ రోహిత్ శర్మ రూ. 214 కోట్ల నెట్ వర్త్ సంపాదనతో ఉండగా అతనైతే రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ కాదు.. ధోనీ సంపాదన దాదాపు రూ. 1000 కోట్లున్నట్లు చెప్పింది. ఇంత సంపాదన ఉన్నా ఈ లిస్టులో టాప్ లో ధోనీ కూడా లేడు. స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ రూ. 1050 కోట్ల సంపాదనతో ఉన్నా అతనూ రిచెస్ట్ క్రికెటర్ కాదు. క్రికెట్ గాడ్ టెండూల్కర్ సంపద కోహ్లీ కంటే చాలా ఎక్కువగా దాదాపు రూ. 1250 కోట్లు.. ఆశ్చర్యమనిపించినా టెండూల్కర్ కూడా రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ కాదు.
రిచెస్ట్ క్రికెటర్ల లిస్టులో టాప్ లో ఉన్నది ఇటీవలే జాంనగర్ రాజాగా ఎంపికైన అజయ్ జడేజా. రూ. 145 కోట్ల సంపాదనతో అతను రిచెస్ట్ క్రికెటర్ గా నిలిచాడు. అజయ్ జడేజా రాజ బంధువులు కేఎస్ రంజిత్ సింహ్ జీ పేరు మీద రంజీ ట్రోఫీ, దులీప్ సింగ్ జీ పేరు మీద దులీప్ ట్రోఫీ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇదండీ రిచెస్ట్ ఇండియన్ క్రికెటర్ కథ..