RGV : వెంకటేష్ తో వర్మ ‘సిండికేట్’.. సర్కార్ కూడా?
RGV: ఇక నుంచి తన గౌరవాన్ని పెంచే సినిమాలే తీస్తానన్న RGV ‘సిండికేట్ ‘ అనే మూవీని తీయబోతున్నట్లు ఇటీవల ప్రకటించారు. ఇందులో మెయిన్ లీడ్ విక్టరీ వెంకటేశ్ నటిస్తారని ప్రచారం జరుగుతోంది. ఆయనతో పాటు అమితాబ్ బచ్చన్, ఫహద్ ఫాజిల్ లాంటి బిగ్ స్టార్స్ ఇందులో కీలక పాత్రల్లో కనిపించబోతున్నారని వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సిఉంది.