Revanth Reddy: రాష్ట్ర ప్రభుత్వం మూసి ప్రక్షానలాకై మూసి పునరుజ్జీవం కోసం ముందుకు వెళతామని ప్రకటించిన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. మూసి పునర్జీవం దిశగా అడుగులు వేసేందుకు ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. మూసీ కాలుష్య మురుగు నీటితో అష్టకష్టాలు పడుతున్న ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజల బాధలు తెలుసుకునేందుకు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలంలోని సంగెం బీమా లింగం కత్వా వద్ద పాదయాత్ర చేసేందుకు రానున్నారు. ఈ సందర్భంగా మూసి బీమా లింగం కత్వా వద్ద ఏర్పాట్ల ను పరిశీలించారు ఎంపీ చామల కుమార్ రెడ్డి ,ఎమ్మెల్యేల కుంభం అనిల్ కుమార్ రెడ్డి ,వేముల విరేశం, రాచకొండ పోలీస్ కమిషనర్ సుదీర్ బాబు, తదితరులు.
ఇది కూడా చదవండి: Telangana: రాష్ట్రంలో భారీగా పెరగనున్న మద్యం ధరలు
Revanth Reddy: ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాదయాత్ర చేపట్టనున్న వలిగొండ మండలం సంగెం మూసి వద్ద ఏర్పాట్లను పరిశీలించిన అనంతరం భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ ఈ నెల 8వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి పుట్టిన రోజు. ఈ సందర్భంగా ఆయన యాదాద్రిలో లక్ష్మీ నరసింహ స్వామిని దర్శించుకోనున్నారు.ఆ తరువాత సీఎం మూసీ పరీవాహక ప్రాంతాల గుండా సీఎం రేవంత్ రెడ్డి పాదయాత్ర చేసి రైతులు ,కులవృత్తుల వారితో మూసి కాలుష్యంతో జనం పడుతున్న వారి ఇబ్బందులు నేరూరుగా మాట్లాడి తెలుసుకుంటారు.
ఇది కూడా చదవండి: J&K Assembly: ఆర్టికల్ 370 రద్దుపై వివాదం..పేపర్లు చించి స్పీకర్‌పై విసిరేసిన సభ్యులు
Revanth Reddy: ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మూసి తో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలు స్వచ్ఛందంగా పెద్ద ఎత్తున తరలి రావాలని కోరారు… కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన మాట ప్రకారం ప్రజల వద్దకు వచ్చి పాలన చేస్తుందని తెలిపారు…రాచకొండ కమిషనర్ సుదీర్ బాబు మాట్లాడతూ సీఎం పర్యటన లో భాగంగా మూసి పరివాహక ప్రాంత రైతలు ప్రజలు సుమారు ఇరవై నుండి ముప్పై వేల మంది పాల్గొంటారని సీపీ తెలిపారు.భద్రత పరంగా ఎటువంటి సమస్యలు తలెత్తకుండా రెండు వేల మంది పోలీస్ సిబ్బంది తో కట్టు దిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు రాచకొండ సీపీ సుదీర్ బాబు.