Revanth Reddy

Revanth Reddy: ఒకే దెబ్బకు రెండు పిట్టలు… రేవంత్ మాస్టర్ ప్లాన్

Revanth Reddy: తెలంగాణలో ఏడాది క్రితం వరకు తిరుగులేని పార్టీగా ఉన్న బీఆర్ఎస్ ఇప్పుడు అష్టకష్టాలను ఎదుర్కొంటోంది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఘోర పరాజయం, ఆ తర్వాత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వలసలు.. వరుస ఎదురు దెబ్బలతో బీఆర్‌ఎస్‌ ఉక్కిరిబిక్కిరి అవుతోంది. బీఆర్‌ఎస్‌ నేతలపై కేసులు, విచారణలు కూడా విరుచుకుపడుతున్నాయి.ఓవైపు ఈ-కారు రేస్ కేసు రైజింగ్‌లో ఉన్న సమయంలో హఠాత్తుగా ORR లీజు టెండర్ల అంశం తెరపైకి రావడంతో తెలంగాణ రాజకీయాలు మరింత హీటెక్కాయి.

Revanth Reddy: ORRను గత బీఆర్ఎస్ హయాంలో కేవలం 7వేల కోట్ల రూపాయలకు ఓ ప్రైవేట్ సంస్థకు కట్టబెట్టిందని కాంగ్రెస్ ప్రభుత్వం ఆరోపిస్తోంది.ఈ అంశంపై విచారణ జరిపిస్తామని అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించడంతో ఇది ఎక్కడికీ దారితీస్తోందోనన్న చర్చ జోరుగా జరుగుతోంది.

ఇది కూడా చదవండి: Royal Challengers Bengaluru: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఆ పేరు వినగానే ముందుగా గుర్తుకువచ్చేది?

Revanth Reddy: ORR లీజ్ టెండర్లపై విచారణ జరిపిస్తామన్న సీఎం రేవంత్ రెడ్డి పదే పదే హరీశ్‌ రావు పేరును ప్రస్తావించడమే హట్‌ టాపిక్‌గా మారింది. హరీశ్‌ రావు కోరిక మేరకే ORR టెండర్లపై సిట్ విచారణ జరిపిస్తామని నొక్కి మరీ చెప్పడం వెనుక రేవంత రెడ్డి ఆంతర్యమేంటనే చర్చ పొలిటికల్‌ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతోంది. ORR లీజుపై అభ్యంతరాలుంటే.. రద్దు చేయండని హరీశ్‌ రావు కామెంట్ చేస్తే.. ఆయన కోరిక మేరకు విచారణ జరిపిస్తామని రేవంత్‌ చెప్పడంలో ఏదో స్ట్రాటజీ ఉందనే అనుమానాలు బీఆర్‌ఎస్‌ నేతలను వెంటాడుతుంది.

Revanth Reddy: గతంలో సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్ని రాజకీయ వర్గాలు గుర్తు చేసుకుంటున్నాయట… తెలంగాణలో కేసీఆర్ ఉనికి లేకుండా చేస్తామని.. కేసీఆర్‌ను రాజకీయంగా మర్చిపోయేలా చేస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి చాలాసార్లు అన్నారు. హరీశ్‌ రావును వాడుకొనే కేటీఆర్‌కు చెక్ పెట్టే దిశగా రేవంత్‌ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారనీ టాక్‌ నడుస్తోంది.ఇప్పుడు హరీశ్‌ రావు కోరిక మేరకే అని అనడంతో.. అప్పటి రేవంత్ మాటల్ని రివైండ్ చేసుకుంటున్నారట… చెప్పినట్టే.. హరీశ్‌ రావును వాడుకొని రేవంత్‌ తన పొలిటికల్ గేమ్ స్టార్ట్ చేశారనే టాక్‌ నడుస్తోంది. కేటీఆర్‌, హరీశ్‌ రావుల మధ్య మనస్పర్ధలు సృష్టించే రాజకీయ చదరంగాన్ని సీఎం రేవంత్ రెడ్డి మొదలు పెట్టారన్న టాక్ నడుస్తోంది.ORR లీజ్ టెండర్లు హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో జరిగాయి. అప్పుడు కూడా మున్సిపల్‌ శాఖ మంత్రిగా కేటీఆర్ ఉన్నారు. కాబట్టి ఓఆర్ఆర్ టెండర్ల తీగ లాగితే.. అది మళ్లీ కేటీఆర్‌కే ఉచ్చులా బిగుసుకునేలా ఉందనే టాక్ నడుస్తోంది

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *