Harish Rao: సీఎం రేవంత్‌రెడ్డికి బీఆర్ఎస్ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు సంచలన సవాల్ విసిరారు. ప్రజలు ఏమి కోల్పోయామో అనే విషయం తెలుసుకున్నారన్న మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యలపై సీఎం రేవంత్‌రెడ్డి స్పందనపై ఆయన ఈ సవాల్ చేశారు. ప్రజలు ఏమీ కోల్పోలేదని, తాము ఎన్నో చేశామని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని, ఆ చేసిందేమిటో చర్చిద్దామా? అని డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ ఆలయంలో దైవదర్శనం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
Harish Rao: రేవంత్‌రెడ్డి సీఎం అయ్యాక రాష్ట్రవ్యాప్తంగా 36 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారని హరీశ్‌రావు విమర్శించారు. తెలంగాణ ప్రజలు ఏం కోల్పోయారో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు. ఏం పొందారో చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? అని ముఖ్యమంత్రిని ప్రశ్నించారు. ఏ రంగం గురించి అయినా మాట్లాడుదాం.. అని, ఆయా రంగాల్లో ప్రజలు ఏం కోల్పోయారో నేను చెప్తా, ఏమి పొందారో? మీరు చెప్పాలని సవాల్ విసిరారు.
Harish Rao: వ్యవసాయ రంగం, సంక్షేమ రంగం, విద్యుత్తు సరఫరా, సాగునీటి రంగం, తాగునీటి వసతులు, విద్యాశాఖ, ఆరోగ్య శాఖలతో పాటు చేసిన అప్పులపైనా మాట్లాడుదామని హరీశ్‌రావు పేర్కొన్నారు. ఏ టాపిక్‌పైన మాట్లాడుదామో మీరే చెప్పండి, ఎక్కడ మాట్లాడుదాము, ఎప్పుడు మాట్లాడుదాము అన్న విషయాలపై మీరే చెప్పండి.. అంటూ సీఎం రేవంత్‌రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.