kodangal: కొడంగల్ నియోజకవర్గంలోని లగచర్లలో అధికారులపై జరిగిన దాడి అనంతరం పరిణామాలను పరిశీలించేందుకు బయలుదేరిన బీఆర్ఎస్ ముఖ్య నేతలను పోలీసులు అరెస్టు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి, కొడంగల్, వికారాబాద్ మాజీ ఎమ్మెల్యేలు నరేందర్‌రెడ్డి, ఆనంద్, బీఆర్ఎస్ రాష్ట్ర నేతలు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, కార్తీక్‌రెడ్డిని కొడంగల్ వెళ్లనీయకుండా మార్గమధ్యంలోనే అరెస్టు చేసి మన్నెగూడ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.