Tirumala: ఫెంగల్ తుఫాన్ ప్రభావంతో దక్షిణ కోస్తా, రాయలసీమలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుపతి జిల్లాలో తడ దగ్గర జాతీయ రహదారిపై పెద్దఎత్తున వాన నీరు నిలిచింది. జిల్లాలోని సూళ్లూరుపేట తడ, దొరవారిసత్రం, నాయుడుపేట, పెళ్లకూరు మండలాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తున్నాయి. తిరుమలలో జలాశయాలు నిండుకుండలా మారాయి. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఐదు ప్రధాన జలాశయాలు దాదాపు పూర్తిగా నిండిపోయాయి.
తిరుమలలో పాపవినాశనం, ఆకాశగంగ, గోగర్భం, కుమారధార, పసుపుధార జలాశయాలు ప్రధాన నీటి వనరులుగా ఉన్నాయి. ఆదివారం ఉదయం 8 గంటల సమయానికి మొత్తం ఐదు జలాశయాల్లో నీటి మట్టం దాదాపు పూర్తి స్థాయికి చేరుకుంది.
నీటిమట్టం వివరాలు ఇలా ఉన్నాయి.
పాపవినాశనం డ్యామ్ :- 693.27 మీ. FRL :- 697.14 మీ.
గోగర్భం డ్యామ్ :- 2894 అడుగులు FRL :- 2894 అడుగులు
ఆకాశగంగ డ్యామ్ :- 855.00 మీ FRL :- 865.00 మీ
కుమారధార డ్యామ్ :- 890.80 మీ FRL :- 898.24మీ
పసుపుధార డ్యామ్ :- 896.35మీ FRL :- 898.24మీ

