IPL 2025 Purse Remaining: ఐపీఎల్ ఫ్రాంచైజీల రిటైన్ లిస్టు వచ్చేసింది. ఎవరెవరు రిటైన్ అయ్యారు.. ఏ జట్టు ఎవరిని అట్టిపెట్టుకుంది .. ఏ ఆటగాడిని వేలానికి వదిలేసిందన్న విషయం నిన్నటితో తేలిపోయింది. అన్న అంశాలు రివీల్ అయ్యాయి. వీరి కోసం ఖర్చు పెట్టగా ఫ్రాంచైజీ దగ్గర ఎంత పర్స్ బ్యాలెన్స్ మిగిలిందన్న విషయం తెలుసుకోవాలంటే వాచ్ దిస్ స్టోరీ..
IPL 2025 Purse Remaining: ఐపీఎల్ 2025 సీజన్‌కు సంబంధించిన రిటెన్షన్స్ జాబితాను అన్ని ఫ్రాంచైజీలు విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ రిటెన్షన్స్‌లో అతి తక్కువ ఖర్చు చేసింది పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ. టోటల్ పర్స్ వాల్యూ 120 కోట్లైతే ఈ ఫ్రాంచైజీ కేవలం 9.5 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఇద్దరు ఆటగాళ్లను అట్టిపెట్టుకుంది. పంజాబ్ కింగ్స్ శశాంక్ సింగ్‌ను 5.5 కోట్లకు, ప్రభ్‌మన్‌సిమ్రన్ సింగ్‌ను 4 కోట్లకు రిటైన్ చేసుకుని మిగతా ఆటగాళ్లందరినీ వేలానికి వదిలేసింది. ఇప్పుడు ఈ ఫ్రాంచైజీ దగ్గర అందరికంటే అత్యధికంగా 110.5 కోట్లు బ్యాలెన్స్ ఉంది. వేలంలో పాల్గొనే ఫ్రాంచైజీల్లో ఏ ఫ్రాంచైజీ దగ్గర ఇంత మొత్తం లేదు. అందుకే ఈ సారి పంజాబ్ కింగ్స్ వేలంలో భారీ కొనుగోళ్లు జరిపే అవకాశం ఉంది. పంజాబ్ కింగ్స్ మెంటార్ గా రికీ పాంటింగ్ ఉండడంతో ఈసారి ఆ జట్టు మరింత పటిష్టంగా మారే అవకాశం కనిపిస్తోంది. వేలంలోకి వచ్చిన రిషభ్ పంత్ కు పాంటింగ్ కు మధ్య మంచి బాండింగ్ ఉంది. దీంతో అతన్ని ఎంతకైనా కొనుగోలు చేస్తారని చెప్పొచ్చు.
ఇది కూడా చదవండి: IPL 2025 Retentions: ఐపీఎల్ 2025 రిటెన్షన్ జాబితా విడుదల..
IPL 2025 Purse Remaining: వేలంలో ఈసారి ఆర్సీబీ కూడా మంచి వ్యూహాత్మకంగా వెళుతున్నట్లే కనిపిస్తోంది. బౌలింగ్ విభాగాన్ని పటిష్టం చేసుకునేలా చేస్తే ..ఈసారికన్నా కప్ దక్కించుకుందామనేలా అడగులు వేస్తున్నట్లే కనిపిస్తోంది. పంజాబ్ కింగ్స్ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఆర్సీబీ దగ్గర ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో 37 కోట్లు ఖర్చు చేసి ఇంకా 83 కోట్ల పర్స్ బ్యాలెన్స్ కలిగి ఉంది. ఆర్సీబీ రిటెన్షన్స్‌లో భాగంగా విరాట్ కోహ్లికి 21 కోట్లు, రజత్ పాటిదార్‌కు 11 కోట్లు, యశ్ దయాల్‌కు 5 కోట్లు ఖర్చు చేసింది. పంజాబ్, ఆర్సీబీ తర్వాత అత్యధిక పర్స్ బ్యాలెన్స్ ఢిల్లీ క్యాపిటల్స్ వద్ద ఉంది. ఈ ఫ్రాంచైజీ దగ్గర ఇంకా 73 కోట్ల బ్యాలెన్స్ ఉంది.
పంజాబ్, ఆర్సీబీ, ఢిల్లీ తర్వాత ఎల్‌ఎస్‌జీ, గుజరాత్, సీఎస్‌కే, కేకేఆర్, ఎస్‌ఆర్‌హెచ్, ముంబై ఇండియన్స్, రాజస్థాన్ రాయల్స్ వద్ద వరుసగా 69 కోట్లు, 69, 55, 51, 45, 45, 41 కోట్ల బ్యాలెన్స్ ఉంది. అన్ని ఫ్రాంచైజీల దగ్గర భారీ మొత్తం మిగిలి ఉండటంతో ఈ సారి వేలం ఆసక్తికరంగా మారనుంది. రిటెన్షన్స్‌లో చాలా ఫ్రాంచైజీలు స్టార్ ఆటగాళ్లను వదిలి పెట్టడంతో సదరు స్టార్ ఆటగాళ్ల కోసం వేలంలో ఫ్రాంచైజీలు ఎగబడే అవకాశం ఉంది.