IPL 2025 Retentions: ఐపీఎల్ రిటెన్షన్ జాబితా వచ్చింది. ఏ ఫ్రాంచైజీ ఎవరిని అట్టిపెట్టుకుంది..? ఏ ఆటగాడు మెగా వేలానికి వస్తాడనేది తేలిపోయింది. గురువారమే చివరి గడువు కాగా.. ఫ్రాంచైజీలు తమ రిటైన్ ఆటగాళ్ల పేర్లతో లిస్ట్‌ను విడుదల చేశాయి. నవంబర్ రెండు లేదా మూడో వారంలో ఐపీఎల్ మెగా వేలం జరగనుంది. రిషభ్ పంత్‌ను ఢిల్లీ, కేఎల్ రాహుల్‌ను లక్నో , శ్రేయస్ అయ్యర్‌ను కోల్‌కతా రిటైన్ చేసుకోలేదు. మ్యాక్స్‌వెల్, కామెరూన్ గ్రీన్, సిరాజ్‌లను ఆర్సీబీ వదులుకుంది. ప్రస్తుతం రిటైన్ చేసుకున్న ఆటగాళ్లు మినహా మిగతా ఆటగాళ్లంతా నవంబర్ చివరి వారంలో జరిగే వేలంలో పాల్గొంటారు.
IPL 2025 Retentions: గత సీజన్ లో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లను నిలుపుకుంటూ సన్ రైజర్స్ హైదరాబాద్ తన రిటైన్ లిస్టును విడుదల చేసింది. రిటైన్ లో క్లాసెన్ అత్యధిక ధర పలికిన ప్లేయర్ గా నిలవగా..టాప్ క్లాస్ ..టీ20 హిట్టర్లను రిటైన్ లిస్టులో చేర్చుకుని స్ట్రాంగ్ టీమ్ ను బిల్డ్ చేసుకునే క్రమంలో అడుగు ముందుకు వేసింది సన్ రైజర్స్ టీమ్.. రిటైన్ లిస్టులో …
పాట్ కమిన్స్- రూ. 18 కోట్లు
అభిషేక్ శర్మ- రూ. 14 కోట్లు
నితీశ్‌కుమార్ రెడ్డి- రూ. 6 కోట్లు
హెన్రిచ్ క్లాసెన్- రూ. 23 కోట్లు
ట్రవిస్ హెడ్- రూ. 14 కోట్లు
IPL 2025 Retentions: పంజాబ్ కింగ్స్ జట్టు కేవలం ఇద్దరు ఆటగాళ్లను మాత్రమే లిస్టులో చేర్చింది. వీరిద్దరూ అన్ క్యాప్ డ్ ప్లేయర్లు కావడం విశేషం.. వేలంలో అందరికంటే అధికమొత్తంతో పంజాబ్ కింగ్స్ బరిలోకి దిగుతోంది. పంజాబ్ కింగ్స్ రిటైన్ లిస్టులో …
శశాంక్ సింగ్- రూ. 5.5 కోట్లు
ప్రభ్‌మన్‌సిమ్రన్ సింగ్- రూ. 4 కోట్లు
కెప్టెన్ కేఎల్ రాహుల్ ను తప్పిస్తూ ..యంగ్ ప్లేయర్లను రిటైన్ చేసుకుంది లక్నో సూపర్ జెయింట్స్ . రిటైన్ లిస్టులో
నికోలస్ పూరన్- రూ. 21 కోట్లు
రవి బిష్ణోయ్- రూ. 11 కోట్లు
మయాంక్ యాదవ్- రూ. 11 కోట్లు
మొహిసన్ ఖాన్- రూ. 4 కోట్లు
ఆయుశ్ బదోని- రూ. 4 కోట్లు
IPL 2025 Retentions: డిఫెండింగ్ చాంపియన్ కోల్ కతా నైట్ రైడర్స్ ఊహించని విధంగా టైటిల్ గెలిపించి పెట్టిన శ్రేయాస్ అయ్యర్ ను వదులుకుంది. జట్టులోని ఆల్మోస్ట్ కోర్ టీమ్ ను కాపాడుకునే ప్రయత్నం చేసింది. కోల్‌కతా నైట్‌రైడర్స్ రిటైన్ లిస్టులో
రింకూ సింగ్- రూ. 13 కోట్లు
వరుణ్ చక్రవర్తి- రూ. 12 కోట్లు
సునీల్ నరైన్- రూ. 12 కోట్లు
ఆండ్రీ రసెల్- రూ. 12 కోట్లు
హర్షిత్ రాణా- రూ. 4 కోట్లు
రమన్‌దీప్ సింగ్- రూ. 4 కోట్లు ఉన్నారు.
IPL 2025 Retentions: హార్డ్ హిట్టర్ మెక్ గుర్గ్ ఉంటాడనుకున్నా.. ఢిల్లీ జట్టు ఆశ్చర్యకరంగా అతన్ని వేలంలోకి వదిలేసింది. అలాగే కెప్టెన్ రిషభ్ పంత్ ను కూడా జట్టు నుంచి రిలీజ్ చేసింది. ట్రిస్టన్ స్టబ్స్ పై నమ్మకముంచుతూ.. అక్షర్ పటేల్ , కుల్దీప్ యాదవ్ లను జట్టులో చేర్చుకుంది..ఢిల్లీ క్యాపిటల్స్ రిటైన్ లిస్టులో
అక్షర్ పటేల్- రూ. 16.5 కోట్లు
కుల్దీప్ యాదవ్- రూ. 13.25 కోట్లు
ట్రిస్టన్ స్టబ్స్- రూ. 10 కోట్లు
అభిషేక్ పోరెల్- రూ. 4 కోట్లు ఉన్నారు.
IPL 2025 Retentions: అంతా మెగా వేలంలోనే అనుకున్నట్లుగా రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు నలుగురు ఇండియన్ ప్లేయర్లతో రిటైన్ లిస్టు ప్రకటించింది. ఒక్క ఫారిన్ ప్లేయర్ నూ రిటైన్ చేసుకోలేదు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రిటైన్ లిస్టులో …
విరాట్ కోహ్లి- రూ. 21 కోట్లు
రజత్ పాటిదార్- రూ. 11 కోట్లు
యశ్ దయాల్- రూ. 5 కోట్లు ఉన్నారు.
IPL 2025 Retentions: ఐపీఎల్ ఆడుతాడా లేడా అన్న ఊహాగానాలకు తెర పడింది. చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ధోనీ ని రిటైన్ చేసుకుంది. పతిరణ ఒక్కడినే ఫారిన్ ప్లేయర్ల కోటాలో రిటైన్ చేసుకున్న చెన్నై టీమ్ ధోనీ తంత్రాన్ని నమ్ముకుని బరిలోకి దిగుతున్నట్లు తెలుస్తోంది. చెన్నై సూపర్ కింగ్స్ రిటైన్ లిస్టులో …
రుతురాజ్ గైక్వాడ్- రూ. 18 కోట్లు
మతీశ పతిరణ- రూ. 13 కోట్లు
శివమ్ దూబే- రూ. 12 కోట్లు
రవీంద్ర జడేజా- రూ. 18 కోట్లు
ఎంఎస్ ధోని- రూ. 4 కోట్లు ఉన్నారు.
IPL 2025 Retentions: ఎవరికి ఎంత చెల్లించి శాటిస్ఫై చేయాలో తేల్చుకుంది ముంబై ఇండియన్స్ . జట్టు మొత్తం స్టార్ ప్లేయర్లు ఉండడం.. అంతా కెప్టెన్ మెటీరియల్ కావడంతో గందరగోళం ఉంది. ముంబై కూడా ఒక్క ఫారిన్ ప్లేయర్ ను కూడా రిటైన్ చేసుకోకపోవడం విశేషం. మరి వేలంలో ఎవరిని సెలక్ట్ చేసుకోవాలో లిస్టు ప్రిపేర్ చేసుకుని మరీ రెడీ అవుతుందేమో..? చూడాలి. ముంబై ఇండియన్స్ రిటైన్ లిస్టులో …
జస్ప్రీత్ బుమ్రా- రూ. 18 కోట్లు
సూర్యకుమార్ యాదవ్- రూ. 16.35 కోట్లు
హార్దిక్ పాండ్యా- రూ. 16.35 కోట్లు
రోహిత్ శర్మ- రూ. 16.30 కోట్లు
తిలక్ వర్మ- రూ. 8 కోట్లు ఉన్నారు.
గతంలో జట్టులో రాణించిన కోర్ టీమ్ ను అట్టి పెట్టుకునేలా గుజరాత్ టైటాన్స్ లిస్టును ప్రకటించింది. గుజరాత్ టైటాన్స్ రిటైన్ లిస్టులో …
రషీద్ ఖాన్- రూ. 18 కోట్లు
శుభ్‌మన్ గిల్- రూ. 16.5 కోట్లు
సాయి సుదర్శన్- రూ. 8.5 కోట్లు
రాహుల్ తెవాతియా- రూ. 4 కోట్లు
షారుఖ్ ఖాన్- రూ. 4 కోట్లు ఉన్నారు.
జట్టులో దాదాపు ఆరు స్థానాలు ఫుల్ ఫిల్ చేస్తూ రాజస్థాన్ జట్టు రిటైన్ లిస్టు విడుదల చేసింది. రాజస్థాన్ రాయల్స్ రిటైన్ లిస్టులో
సంజూ శాంసన్- రూ. 18 కోట్లు
యశస్వి జైస్వాల్- రూ. 18 కోట్లు
రియాన్ పరాగ్- రూ. 14 కోట్లు
దృవ్ జురెల్- రూ. 14 కోట్లు
షిమ్రోన్ హెట్‌మైర్- రూ. 11 కోట్లు
సందీప్ శర్మ- రూ. 4 కోట్లు ఉన్నారు.