Delhi: దేశ రాజధాని నగరమైన ఢిల్లీలో వాయు కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరింది. దీపావళి సందర్భంగా బాణసంచా వినియోగంతో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) తీవ్రస్థాయికి చేరింది. దీంతో ఊపిరి పీల్చుకోలేక నగర ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. దీపావళికి బాణసంచా కాల్చడంపై ప్రభుత్వం నిషేధం విధించినా ప్రజలు బేఖాతరు చేయడంతో ఈ ఒక్కరోజులోనే వాయు కాలుష్యం మరింతగా పెరిగింది.
Delhi: ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (ఏక్యూఐ) మునుపెన్నడూ లేనంతగా ఢిల్లీలో సగటున 400కు చేరి ప్రమాద సంకేతాలను ఇస్తున్నది. నగరంలోని వివిధ ప్రాంతాల వారీగా చూస్తే ఆనంద్ విహార్ 386, నెహ్రూనగర్ 368, వివేక్ విహార్ 353, ఆర్కే పురం 376, నార్త్ క్యాంపస్ ఢిల్లీ యూనివర్సిటీ 353, అశోక్ విహార్ 363, వాజిర్పూర్ 363గా నమోదైంది. దీపావళి బాణసంచా కారణంగా ఒక్కసారిగా 30 నుంచి 50 వరకు పెరిగింది.