Hyderabad: హైదరాబాద్ నగరంలో బంజారాహిల్స్‌లోని కేబీఆర్ పార్కు వద్ద కారు బీభత్సం సృష్టించింది. బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి నుంచి కేబీఆర్ పార్కు వైపు వెళ్తున్న పోర్షే కారు అతి వేగంతో మూలమలుపు వద్ద అదుపు తప్పి గోడను ఢీకొట్టి చెట్టును ఢీకొన్నది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జు నుజ్జయింది. కారు డ్రైవర్ పరారీలో ఉండగా, కారుకు ఎలాంటి నంబర్ ప్లేట్ లేదని పోలీసులు గుర్తించారు.