Revanth Reddy: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీంకోర్టులో శుభవార్త లభించింది. ఆయనపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
ముందుగా, పెద్దిరాజు అనే వ్యక్తి సీఎం రేవంత్‌పై పలు ఆరోపణలతో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అయితే, తెలంగాణ హైకోర్టు ఆ పిటిషన్‌ను ఆధారాలులేవన్న కారణంతో కొట్టివేసింది. ఈ తీర్పును సవాల్ చేస్తూ పెద్దిరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఇది కూడా చదవండి: Nimisha Priya Case: నిమిష ప్రియ కేసులో ట్విస్ట్: ఉరిశిక్ష రద్దు వార్తలు అవాస్తవం ప్రభుత్వ వర్గాల వెల్లడి
అయితే, సుప్రీంకోర్టులోనూ ఆయనకు ఎదురుదెబ్బ తగిలింది. హైకోర్టు తీర్పును తేలికగా కొట్టివేయలేమని, రేవంత్‌పై సరైన ఆధారాలు లేవని న్యాయస్థానం స్పష్టం చేసింది. అంతే కాకుండా, పెద్దిరాజుతో పాటు ఆయన తరఫున వాదించిన అడ్వొకేట్‌కు కూడా కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ చేసింది. రాతపూర్వకంగా వివరణ ఇవ్వాలని సూచించిన సుప్రీంకోర్టు, ఈ కేసు తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదా వేసింది.