Health Tips: వంటగదిలో ఉండే మసాలా వస్తువులు ఔషధ గుణాలను కలిగి ఉంటాయి. దగ్గు, జలుబు, జ్వరం వంటి సాధారణ వ్యాధులకు ఈ సుగంధ ద్రవ్యాలు దివ్యౌషధంగా పనిచేస్తాయి. ఈ మసాలా దినుసులను తెలివిగా వాడితే అనేక చిన్న చిన్న వ్యాధులను నయం చేయడమే కాకుండా శరీరంలో రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ముఖ్యంగా అల్లం, పసుపులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అల్లంలోని జింజెరాల్, పసుపులోని కర్కుమిన్ వంటి బయోయాక్టివ్ పదార్థాలు శరీరంలోని శక్తిని పునరుద్ధరిస్తాయి.
ఇది కూడా చదవండి: Arvind Kejriwal: కేజ్రీవాల్ పై కాంగ్రెస్ ఫోర్జరీ కేసు
అల్లం – పసుపు ప్రయోజనాలు
Health Tips: అల్లంలో ఉండే జింజెరాల్ శక్తివంతమైన వ్యాధులను నయం చేసే లక్షణాలను కలిగి ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. సరైన మొత్తంలో, సరైన సమయంలో దీన్ని తీసుకుంటే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ఇక ఆరోగ్యం అనేది ఆహారంపైనే ఆధారపడి ఉండదు. జీవనశైలి పైనా ఇది ఆధారపడి ఉంటుంది. ఆల్కహాల్, ధూమపానానికి దూరంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
Health Tips: అల్లం, పసుపు యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగివున్నాయి. వీటిని రెగ్యులర్ గా ఆహారంలో చేర్చుకుంటే అనారోగ్యం నుంచి తప్పించుకోవచ్చు. కాబట్టి మన వంటింట్లో ఉండే అల్లం, పసుపును నిర్లక్ష్యం చేయకుండా క్రమం తప్పకుండా తీసుకోవాలి.