RIL-Viacom18

RIL- Viacom18: ఒకటైన డిస్నీ స్టార్ ఇండియా – రిలయన్స్ వయాకామ్-18

RIL- Viacom18: డిస్నీ స్టార్ ఇండియా – రిలయన్స్ వయాకామ్-18 ఇప్పుడు ఒకటిగా మారాయి. ఇందులో డిస్నీ హాట్‌స్టార్, జియో సినిమా కూడా ఉన్నాయి. ఈ రెండు కంపెనీలు నవంబర్ 14, గురువారం ఈ విషయాన్ని ప్రకటించాయి. ఈ విలీనం తర్వాత దేశంలోనే అతిపెద్ద ఎంటర్‌టైన్‌మెంట్ నెట్‌వర్క్‌గా ఇది అవతరించింది.

ఇది కూడా చదవండి: UPPSC: ప్రావిన్షియల్ సివిల్ సర్వీస్ ప్రిలిమినరీ పరీక్ష ఒక షిఫ్ట్‌లోనే

డిస్నీ-రిలయన్స్ ఎంటర్‌టైన్‌మెంట్ కు ఇప్పుడు 75 కోట్ల వ్యూయర్ షిప్ తో ఉంది.  2 ఓవర్ ది టాప్ అంటే OTT – 120 ఛానెల్‌లు దీనికి ఉన్నాయి.  ఈ జాయింట్ వెంచర్ కోసం రిలయన్స్ రూ.11,500 కోట్లు పెట్టుబడి పెట్టింది. గత ఏడాది కాలంగా విలీన ప్రక్రియ కొనసాగుతోంది. 70,352 కోట్లకు ఈ డీల్‌ కుదిరినట్లు రెండు కంపెనీలు తెలిపాయి. విలీనం తర్వాత ఏర్పడిన కంపెనీలో రిలయన్స్‌కు 63.16%, డిస్నీకి 36.84% వాటా ఉంటుంది. ఈ కొత్త కంపెనీకి నీతా అంబానీ చైర్‌పర్సన్‌గా వ్యవహరిస్తారు. వైస్ చైర్‌పర్సన్‌గా ఉదయ్ శంకర్ వ్యవహరిస్తారు. ఈ జాయింట్ వెంచర్‌కు ముగ్గురు సీఈఓలు నాయకత్వం వహిస్తారు. ముగ్గురూ వేర్వేరు వర్టికల్స్ ను హ్యాండిల్ చేస్తారు.  కెవిన్ వాజ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఆర్గనైజేషన్‌కు నేతృత్వం వహిస్తారు. కిరణ్ మణి డిజిటల్ ఆర్గనైజేషన్ బాధ్యతలు చేపట్టనున్నారు. సంజోగ్ గుప్తా క్రీడా సంస్థకు నాయకత్వం వహిస్తారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *