Tirumala: టీటీడీకి భారీ విరాళం ఇచ్చిన రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో

Tirumala: తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారికి ఓ భక్తుడు భారీ విరాళం అందజేశారు. రిలయన్స్ ఇండస్ట్రీస్ సీఈవో పి.ఎం.ఎస్. ప్రసాద్ బుధవారం టీటీడీ (Tirumala Tirupati Devasthanams) ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టుకు 1 కోటి 11 లక్షలు 11 వేల 111 రూపాయల విరాళాన్ని అందజేశారు. ఈ మేరకు విరాళం డీడీని శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి అందజేశారు.

ఇటీవల, తిరుపతికి చెందిన ఒక వ్యాపారి కూడా స్వామివారికి 1 కోటి రూపాయల విరాళం అందజేసిన విషయం తెలిసిందే.

కాగా, జనవరి 7న తిరుమలలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణంగా, సంవత్సరంలో నాలుగుసార్లు ఈ కార్యక్రమం నిర్వహించడం

ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి ఈ పర్వదినాల ముందు ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించడం పరంపరగా వస్తోంది.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *