kakinada: కాకినాడ కార్పొరేషన్‌లో వైసీపీ మాజీ కార్పొరేటర్ బవులూరి రామకృష్ణ ఆగడాలకు హద్దు లేకుండా పోతుంది.
తనకున్న అధికారుల పరిచయాలతో తాను కార్పొరేటర్‌గా చేసిన వార్డులో వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలన్న ఆయనకు చిత్తు కట్టవలసిందే. లేని పక్షంలో ఆ వ్యాపారస్తుడిపై ఎలాంటి కక్ష సాధింపులు చర్యలు అయిన వెనకడుగు వేయరు. ఎవరన్నా బిల్లింగ్ నిర్మించుకుంటే అందులో అవకతవకలు ఉన్నాయనిరంటా… తక్షణమే తనకు పెద్ద మొత్తంలో డబ్బును చెల్లించాలని లేనిపక్షంలో మీ బిల్లింగ్ నిర్మాణం మీద కమిషనర్లకు కంప్లైంట్‌లు పెడతామని యాజమాన్యులపై బెదిరింపులకు పాల్పడుతూ ఉంటారంట… ఇటీవలే ఒక షాపింగ్ కాంప్లెక్స్ యజమాని బెదిరించారు. అంతే కాకుండా ప్రశ్నించిన ప్రజలను కూడా ఏదో ఒక రూపంలో హింసించడమే లక్ష్యంగా పెట్టుకొన్నారు. కాకినాడలోని కొన్ని ప్రాంతాల్లో తాను చెప్పిందే శాసనంగా భావించాలని స్థానికంగా ఉన్న అధికారులపై హుకుం జారీ చేస్తుంటారు.
ఇది కూడా చదవండి: Telangana: తెలంగాణలో బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య పొలిటికల్ రచ్చ!
kakinada: అధికారులు ఎవరన్నా ఆయన మాటలకు వెనకడుగు వేస్తే ఎమ్మెల్యేతో చెప్తానని అధికారులను హెచ్చరిస్తూ తన జేబు నింపుకోవడమే ఈయన గారి ప్రధాన లక్ష్యం అంట..మళ్లీ నేనే ఈ ప్రాంతానికి నాయకుడు అని ప్రతి ఒక్కరు తాను చెప్పిన మాట వినాలని లేనిపక్షంలో మీ అంతు చూస్తానంటూ శభాదాలు చేస్తూ ఉంటారంట..మరి… కాకినాడలో ఇంత జరుగుతున్నప్పటికీ ప్రజా ప్రతినిధులు దీని మీద ఎందుకు చర్యలు తీసుకోవడం లేదంటూ వ్యాపారస్తులు గగ్గోలు పెడుతున్నారు.ఒక పక్క ప్రజలను మరోపక్క వ్యాపారులను ఇంతటి ఇబ్బందులకి గురి చేస్తున్నారు.
kakinada: ఈ అవినీతి తిమింగళంపై కుటమి ప్రభుత్వం దృష్టి పెడుతుందని ప్రజల్లో నమ్మకం రోజురోజుకీ పెరిగిపోతుంది. దర్జాగా దందా చేసుకుంటూ అధికారుల సైతం భయభ్రాంతులకు గురిచేస్తూ, తాను ఎమ్మెల్యేకి ఎంత చెప్తే అంత అంటూ దొరికిన కాడికి గుంజేస్తున్నారట… పేదవాడు సొంతింటి కల నెరవేర్చుకోవాలంటే ముందుగా ఈ ద్వితీయ శ్రేణి నాయకుడుకు చిత్తు చెల్లించాల్సిందే… లేదంటే ఇక ఆ బిల్డింగ్ పనులు ముందుకు వెళ్లే సమస్య లేదు. అలాగే ఆ ప్రాంతంలో ఉన్న దేవాలయాలను కూడా తన గుప్పెట్లో పెట్టుకొని వాటికి వస్తున్న విరాళాలను మాయం చేస్తూ ఉంటారంట…వ్యాపారస్తులు వ్యాపారం చేసుకోవాలంటే ఇద్దరికి డైలీ మామూలు ఇవ్వాల్సిందే… లేకపోతే వీళ్ళ మీద అధికారులకు అనేక కంప్లైంట్లు, ఇక మాకు ప్రశాంతత లేదు…
ఇది కూడా చదవండి: Sunita Williams: అంతరిక్షంలో సునీత విలియమ్స్ క్రిస్మస్ సెలెబ్రేషన్స్
kakinada: మేము చావనైనా చస్తాము తప్ప ఈ దుర్మార్గుడా చేతుల్లోంచి మమ్మల్ని కాపాడండి మహా ప్రభువు అంటూ కూటమి ప్రభుత్వాన్ని అధికారుల నుంచి సామాన్య ప్రజల వరకు కూడా వేడుకుంటున్నారట… ఇటువంటి నాయకులను ఎమ్మెల్యేలు దగ్గర పెట్టుకుంటే వాళ్లు కూడా చెడ్డ పేరు వస్తుందని ఇటీవల స్థానిక ఎమ్మెల్యే కూడా నువ్వు నా వద్ద రావద్దంటూ నీలాంటి వాళ్ళ వల్ల మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందని హుకుం జారి చేసినట్లు నాయకుల్లో గుసగుసలు మొదలయ్యాయి.ఇప్పటితోనైనా ఈ ద్వితీయ శ్రేణి నాయకుడు ఆగడాలు ఆగుతాయా… మరింత పెరుగుతాయా కుటమి ప్రభుత్వం వారిపైన దృష్టి పెట్టి, అటు వ్యాపారస్తులను ఇటు సామాన్య ప్రజలను, కాపాడుతారా, మరి ఏం జరుగుతుంది అనేది వేచి చూడాలి.