Nobel Peace Prize: నోబెల్ శాంతి పురస్కార విజేత ఎంపికలో రాజకీయ వివక్ష చూపించారంటూ అమెరికా శ్వేతసౌధం మండిపడింది. అధ్యక్షుడు ట్రంప్ నకు నోబెల్ ఇవ్వకపోవడాన్ని విమర్శించిన.. వైట్ హౌస్ కమ్యూనికేషన్స్ డైరెక్టర్ “స్టీవెన్-చుయెంగ్”…నోబెల్ కమిటీ మరోసారి శాంతి స్థాపన కంటే రాజకీయాలకే అధిక ప్రాధాన్యం ఇచ్చిందని దుయ్యబట్టారు. ప్రపంచ శాంతి కోసం నిజమైన నిబద్ధత చూపించిన వారిని పక్కన బెట్టారన్నారు.
అయినా ట్రంప్ ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలను ఆపేందుకు తన ప్రయత్నాలు కొనసాగిస్తూ శాంతి ఒప్పందాలతో ప్రాణాలు నిలబెడుతారని చుయెంగ్ తెలిపారు. ట్రంప్ గొప్ప మానవతావాది అన్న వైట్ హౌజ్ అధికారి.. తన సంకల్ప శక్తితో పర్వతాలను కదిలించే ఆయనలాంటి వ్యక్తి మరొకరు ఉండరని పోస్ట్ చేశారు.
ఇది కూడా చదవండి: Pawan Kalyan: పుస్తకాలు చదవడం వల్ల మానసిక పరిపక్వత పెరుగుతుంది
నోబెల్ శాంతి బహుమతి ఓ జోక్ గా మారిందని, తెలివి ఉన్నవారు ఎవరైనా ట్రంప్ నకే నోబెల్ రావాల్సిందని అనుకుంటారని…ట్రంప్ నకు మద్దతిచ్చే “మాగా వాయిస్”… విమర్శలు గుప్పించింది.
నోబెల్ శాంతి బహుమతి తనకు రావాలని తీవ్రంగా ఆశించిన అమెరికా అధ్యక్షుడు “డొనాల్డ్ ట్రంప్”నకు నిరాశ ఎదురవడానికి…పలు కారణాలు ఉన్నాయి.
ముఖ్యంగా ఆయన పరిష్కరించినట్లు చెప్పుకుంటున్న వాటిలో చాలావరకు…యుద్ధాలు కాదు ఉద్రిక్తతలు మాత్రమే..! ఉక్రెయిన్-రష్యా యుద్ధం ఇంకా కొనసాగుతుండగా…గాజా విషయంలో అనిశ్చితి మిగిలే ఉంది. మరోవైపు నామినేషన్ గడువు ముగిసిన తర్వాత ట్రంప్ ను పలు దేశాధినేతలు నోబెల్ ప్రైజ్ కు ప్రతిపాదించడం కూడా…ఈ ఏడాది ట్రంప్ నకు అవార్డు రాకపోవడానికి ఒక ముఖ్యమైన కారణంగా…విశ్లేషకులు చెబుతున్నారు.