Ratan Tata: టాటా సన్స్ ఎమెరిటస్ చైర్మన్ రతన్ నావల్ టాటా (86) కన్నుమూశారు. బుధవారం అర్థరాత్రి ఆయన మరణించినట్టు ప్రకటించారు. తీవ్ర అనారోగ్యం కారణంగా ముంబైలోని బ్రీచ్ క్యాండీ హాస్పిటల్‌లోని ఇంటెన్సివ్ కేర్ యూనిట్ (ఐసీయూ)లో ఆయన్ని చేర్చారు. రతన్ టాటా కొంతకాలంగా వయసు సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారు.
రెండు రోజుల క్రితం కూడా ఆయన ఐసీయూలో చేరినట్లు వార్తలు వచ్చాయి. అయితే అప్పుడు నేను బాగానే ఉన్నాను, ఆందోళన చెందాల్సిన పని లేదు అని ఆయన ప్రకటించారు. 2008లో, రతన్ టాటా భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన పద్మ విభూషణ్‌ను అందుకున్నారు. దీనికి ముందు 2000లో ఆయనను పద్మభూషణ్‌తో సత్కరించారు.
Ratan Tata: రతన్ టాటా మృతిపై టాటా సన్స్ ఛైర్మన్ ఎన్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ‘అపారమైన నష్టాన్ని అనుభవిస్తూ రతన్ టాటాకు వీడ్కోలు పలుకుతున్నాం. టాటా గ్రూప్‌కు చైర్‌పర్సన్ కంటే ఎక్కువ. నాకు ఆయన గురువు, మార్గదర్శకుడు – స్నేహితుడు అంటూ పేర్కొన్నారు.