The Girlfriend: నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటిస్తున్న ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న రిలీజ్ అవుతోంది. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమాకి సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ సభ్యుల నుంచి ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ లభించింది.
Also Read: Rowdy Janardhan: రౌడీ జనార్దన్’ సినిమాలో ఆ సీనియర్ నటి.?
నేషనల్ క్రష్ రష్మిక మందన్న లేటెస్ట్ చిత్రం ‘ది గర్ల్‌ఫ్రెండ్’ నవంబర్ 7న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమైంది. యాక్టర్ రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా, దీక్షిత్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను ఆకర్షిస్తోంది. ఈ చిత్రం ఎలా ఉండబోతుందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజాగా సెన్సార్ పనులు ముగిశాయి. సెన్సార్ బోర్డు ఈ సినిమాకి యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. చిత్రంలోని ఎమోషన్స్, కంటెంట్ ప్రేక్షకులను మెప్పిస్తాయని చిత్ర యూనిట్ ధీమా వ్యక్తం చేస్తోంది. రన్‌టైమ్‌ను 2 గంటల 18 నిమిషాలుగా లాక్ చేశారు. రావు రమేష్, రోహిణి, అను ఇమ్మాన్యుయెల్ తదితరులు ఈ సినిమాలో ముఖ్య పాత్రల్లో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి హేషమ్ అబ్దుల్ వహీబ్ సంగీతం అందించారు. అల్లు అరవింద్ సమర్పణలో ఈ సినిమాని విద్య కొప్పినీడి, ధీరజ్ మొగిలినేని నిర్మిస్తున్నారు.

