Vijay Devarakonda: రశ్మిక నటిస్తున్న మరో పాన్ ఇండియా సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా అల్లు అరవింద్ సమర్పణలో మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మిస్తున్నాయి. ‘దసరా’ ఫేమ్ దీక్షి శెట్టి హీరోగా నటిస్తున్న ఈ సినిమా టీజర్ ను రశ్మిక రియల్ లైఫ్ బోయ్ ఫ్రెండ్ విజయ్ దేవరకొండ రిలీజ్ చేశారు.
ఇది కూడా చదవండి: Pushpa 2 Collections: బాక్సాఫీస్ ని రూల్ చేస్తున్న పుష్ప 2.. వైల్డ్ ఫైర్ లో కాలిపోతున్న రికార్డ్స్!!
Vijay Devarakonda: విజయ్ దేవరకొండ వాయిస్ ఓవర్ తో ఆరంభం అయిన ఈ టీజర్ లో రాహుల్ రాసిన పొయిటిక్ డైలాగ్స్ ఆక్టటుకునేలా సాగాయి. ప్రేమ, మిస్టరీ, సస్పెన్స్ మిలిళమైన ఈ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. హేషమ్ అబ్దుల్ వహాబ్ మ్యూజిక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ‘పుష్ప2’ తర్వాత వస్తున్న రశ్మిక సినిమా కావటం కూడా సినిమాకు ఎంతో ప్లస్ కానుంది. ఈ సినిమాను విద్యా కొప్పినీడితో కలసి ధీరజ్ నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.