Nani: న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ‘ది ప్యారడైజ్’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక పేరు గట్టిగా వినపడుతుంది.ఈ కథలో హీరోయిన్ క్యారెక్టర్‌కి రష్మిక అయితే బాగా సెట్ అవుతుందనే అభిప్రాయంలో ఉన్నాడట దర్శకుడు శ్రీకాంత్. అంతే కాదు రష్మిక గ్లామర్, పెర్ఫార్మెన్స్ కాంబినేషన్ ఈ మూవీకి పర్ఫెక్ట్గా సరిపోతుందని, నాని స్వయంగా ఆమె డేట్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నాడట. కానీ రష్మిక ప్రస్తుతం ఎంత బిజీగా ఉందో మనకు తెలిసిందే. వరుసగా చావా, యానిమల్, పుష్ప సినిమాల విజయాల తర్వాత ఆమెకు పాన్ ఇండియా క్రేజ్ పెరిగింది. ప్రస్తుతం ‘కుబేర’ తో పాటు మరి కొన్ని సినిమాలతో బిజీగా ఉన్న ఆమె, నాని సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తుందా అన్నది ప్రశ్నగా మారింది.

