Rape Case: కామంతో కళ్లు మూసుకుపోయిన ఓ ఏడుగురు దుర్మార్గులు అభం, శుభం తెలియని ఓ మైనర్‌పై రాకాసుల వలే దాడి చేసి పీక్కుతిన్నంత పనిచేశారు. ఒకరోజు కాదు.. నాలుగు రోజులపాటు బంధించి నరక యాతన చూపారు. ఆ బాలిక ఇంటిలో జరిగిన చిన్నపాటి విభేదాలతో మనస్తాపం చెంది ఇంటి నుంచి ఒంటరిగా బయటకు రావడమే ఆమె చేసిన తప్పు. దీన్ని ఆసరా చేసుకున్న ఆ దుండగులు ఉచ్ఛం, నీచం చూడకుండా, చట్టం, న్యాయానికి బెదరకుండా తెగించేశారు. నాలుగు రోజుల పాటు ఆ బాలికపై సామూహిక అత్యాచరానికి ఒడిగట్టారు.
Rape Case: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏడుగురు నిందితులు ఈ దురాగతానికి పాల్పడ్డారు. కృష్ణా జిల్లాకు చెందిన ఆ మైనర్ (14) తన ఇంటిలో చిన్నవివాదం నెలకొనడంతో మనస్తాపంతో ఇంటి నుంచి ఒంటరిగా అదే జిల్లాలోని వీరపనేనిగూడెంలోని బంధువుల ఇంటికి వచ్చింది. దీనిని ఆసరాగా తీసుకున్న ఓ ఇద్దరు ఆ బాలికకు మాయమాటలు చెప్పారు. ఆమెను జీ కొండూరులో దింపుతామని చెప్పి బైక్‌పై తీసుకెళ్లారు.
Rape Case: ఈ సమయంలో ఆ బాలికపై ఆ ఇద్దరు దుండగులు లైంగికదాడికి పాల్పడ్డారు. ఆ తర్వాత వారిలో మూర్ఖపు ఆలోచన రేకెత్తింది. దీంతో తమ మరో ఐదుగురు స్నేహితులను పిలిపించుకున్నారు. ఇలా ఆ బాలికను ఓ ఇంటిలో నిర్బంధించి ఆ ఏడుగురు నిందితులు నాలుగు రోజులపాటు ఒకరి తర్వాత ఒకరుగా సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. ఈ సమయంలో ఆ బాలికను చిత్రవధకు గురిచేశారు. తనను వదిలేయండని చేతులెత్తి వేడుకున్నా ఆ నీచులు వదలలేదు.
Rape Case: చివరకు ఆ బాలికను సోమవారం ఆటోలో తీసుకొచ్చిన ఆ యువకులు ఎన్టీఆర్ జిల్లా మాచవరంలో వదిలి వెళ్లారు. ఆ సమయంలో ఆ బాలిక నడవలేని, మాట్లాడలేని స్థితిలో ఉన్నది. దీనిని గమనించిన మరో ఆటో డ్రైవర్‌ను స్థానిక పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లాడు. ఈ మేరకు స్పందించిన పోలీసులు సీసీటీవీ పుటేజీ ఆధారంగా కేసును ఛేదించి, ఆ ఏడుగురు నిందితులను అరెస్టు చేశారు. ఈ ఏడుగురు నిందితుల్లో ఇటీవలే 10వ తరగతి పరీక్షలు రాసిన మైనర్‌గా పోలీసులు గుర్తించారు.

