RaoBahadur Teaser: ప్రముఖ నటుడు సత్యదేవ్ హీరోగా, విభిన్నమైన కథలతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు వెంకటేష్ మహా దర్శకత్వంలో తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘రావు బహదూర్’. జీఎంబీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై సూపర్ స్టార్ మహేశ్ బాబు, ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్ సమర్పిస్తున్న సినిమా ఇది. అసలు ఇలాంటి సినిమా ఒక్కటి నిర్మిస్తున్నారు అని ఆడియన్సు కి తెలియదు. కానీ టీజర్ లాంచ్ కోసం రిలీజ్ చేసిన పోస్టర్ తో సినిమా పైన మంచి ఆసక్తి నెలకొంది. కొత్తగా ఉన్న పోస్టర్. అందులో ఉన్న సత్యదేవ్ క్యారెక్టర్ తో కొత్త కథ చెప్పబోతున్నాడు అని అందరికి అర్ధం అయింది.
తాజాగా ఈ చిత్ర టీజర్‌ను దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి విడుదల చేశారు. మహేశ్ బాబు సమర్పిస్తున్న సినిమా కావడంతో ముందే అంచనాలు పెరిగిపోగా, ఇప్పుడు రాజమౌళి రిలీజ్ చేసిన టీజర్ కారణంగా ఆసక్తి మరింత రెట్టింపు అయ్యింది.
టీజర్ హైలైట్స్
“నాకు అనుమానం అనే భూతం పట్టింది..” అనే ఆసక్తికరమైన డైలాగ్‌తో టీజర్ ప్రారంభం అవుతుంది. కేవలం ఆ ఒక్క మాటతోనే కథలోని మిస్టరీని ప్రేక్షకుల ముందుంచి, సస్పెన్స్ వాతావరణాన్ని సృష్టించింది. విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో కలిపి చూస్తే ఇది సైకాలజికల్ డ్రామా అని స్పష్టమవుతోంది.
ఇది కూడా చదవండి: Pedda Reddy: హైకోర్టు ఆర్డర్స్ ఉన్నాయి… ఎందుకు అడ్డుకుంటున్నారు
సోషల్ మీడియాలో బజ్
టీజర్ విడుదలైన వెంటనే సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. సత్యదేవ్ నటన, వెంకటేష్ మహా స్టైల్ ఆఫ్ నేరేషన్ ఈ సినిమాకి కొత్త రకం అనుభూతిని ఇవ్వబోతున్నాయన్న నమ్మకం ప్రేక్షకుల్లోనూ, సినీ వర్గాల్లోనూ కనిపిస్తోంది.
ఎప్పుడొస్తోంది?
వచ్చే వేసవి సీజన్‌లో ‘రావు బహదూర్’ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా సత్యదేవ్ కెరీర్‌లో మరో ముఖ్యమైన మైలురాయిగా నిలుస్తుందనే అంచనాలు వినిపిస్తున్నాయి.