Ranji Trophy Cricket

Ranji Trophy Cricket: నేటి నుంచే రంజీ ట్రోఫీ క్రికెట్.. మారిన నిబంధనలు.. 

Ranji Trophy Cricket: భారత్‌లో దేశీయ క్రికెట్ రంజీ సీజన్ ప్రారంభం కానుంది. రంజీ ట్రోఫీ తొలి రౌండ్‌ మ్యాచ్‌ అక్టోబర్‌ 11వ తేదీ శుక్రవారం ప్రారంభం కానుంది. తొలిరోజు వివిధ మైదానాల్లో 19 మ్యాచ్‌లు జరగనుండగా, ఇందులో 38 జట్లు పాల్గొంటాయి. ఈ మ్యాచ్‌లు ప్రారంభానికి ఒక రోజు ముందు, రంజీ ట్రోఫీతో సహా దేశవాళీ క్రికెట్‌లోని కొన్ని నిబంధనలలో బీసీసీఐ మార్పులు చేసింది. సీజన్ ప్రారంభానికి ఒక రోజు ముందు, అంటే అక్టోబర్ 10వ తేదీ గురువారం సాయంత్రం అన్ని జట్లకు ఈ మార్పుల గురించి తెలియచేసింది. ఇందులో బ్యాటింగ్, బౌలింగ్ లతో సహా పాయింట్ల పంపిణీ వరకు మారిన నియమాలు ఉన్నాయి. ఇప్పుడు బోర్డు ఎలాంటి మార్పులు చేసిందో తెలుసుకుందాం.

బ్యాటింగ్ ట్రిక్కులు పని చేయవు

Ranji Trophy Cricket: ఈసారి బ్యాటింగ్ నిబంధనలకు సంబంధించి బీసీసీఐ అతిపెద్ద మార్పు చేసింది. ఇక నుంచి దేశవాళీ క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ చాకచక్యం పనిచేయదు. ఇంతకుముందు, గాయం లేకపోయినా, చాలా మంది బ్యాట్స్‌మెన్ విశ్రాంతి కోసం తమ ఇన్నింగ్స్‌ను మధ్యలో వదిలి మైదానం నుండి బయటకు వెళ్లి, ఫ్రెష్ అప్ అయ్యి మళ్లీ బ్యాటింగ్‌కు వచ్చేవారు. కానీ ఇప్పుడు ఈ పని వారికి ఖర్చుతో కూడుకున్నది. ఎవరైనా బ్యాటర్  కొత్త సీజన్‌లో ఇలా చేస్తే, అతన్ని తక్షణమే ఔట్‌గా పరిగణిస్తారు. 

Ranji Trophy Cricket: రిటైర్ అయ్యి మైదానం వీడిన బ్యాట్స్‌మెన్ మళ్లీ బ్యాటింగ్ చేయలేరు. దీనికి ప్రత్యర్థి జట్టు కెప్టెన్‌కు ఎలాంటి అభ్యంతరం లేకపోయినా.. బ్యాట్స్‌మెన్‌ను ఔట్‌గా పరిగణిస్తారు. ఈ నియమాలు రంజీ ట్రోఫీలో మాత్రమే కాకుండా అన్ని దేశవాళీ మ్యాచ్‌లకు వర్తిస్తాయి. అత్యంత ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఇక నుంచి దేశవాళీ మ్యాచ్‌ల్లో కూడా సూపర్‌ ఓవర్‌ అమలు చేయవచ్చని బీసీసీఐ తెలిపింది.

బౌలింగ్‌లో ఈ నిబంధన మారింది

బిసిసిఐ బౌలింగ్ నిబంధనలలో కూడా కొన్ని మార్పులు చేసింది.  లాలాజలానికి సంబంధించి కఠినమైన చర్యలు తీసుకుంది. ఏదైనా జట్టు బంతిపై లాలాజలం ఉపయోగిస్తే, వెంటనే దానిని మారుస్తామని బోర్డు తెలిపింది. ఇది కాకుండా, తక్షణమే అమలులోకి వచ్చేలా ఆ జట్టుపై పెనాల్టీ కూడా విధిస్తారు. 

Ranji Trophy Cricket: బీసీసీఐ కూడా పరుగులు నిలిపివేసే నిబంధనల్లో మార్పులు చేసింది. కొత్త నిబంధన ప్రకారం, బ్యాట్స్‌మన్ ఒక పరుగు తర్వాత ఆగినట్లైతే.. ఆ బాల్  ఓవర్‌త్రో తర్వాత, ఒకరినొకరు దాటడానికి ముందు ఒక బౌండరీని చేరుకున్నట్లయితే, అప్పుడు బౌండరీ అంటే 4 పరుగులు మాత్రమే స్కోరుకు జోడిస్తారు. ICC T20 వరల్డ్ కప్ 2024 సందర్భంగా కుదిరిన ఒప్పందం ప్రకారం ఈ నిబంధనను మార్చినట్లు బోర్డు తెలిపింది. అంతకుముందు బ్యాట్స్‌మెన్ చేసిన పరుగులు,  ఓవర్ త్రో వలన వచ్చిన  పరుగులు రెండూ స్కోర్‌కు కలిపేవారు. 

పాయింట్ల విషయంలో మార్పు.. 

Ranji Trophy Cricket: పాయింట్ల కు సంబంధించి భారత క్రికెట్ బోర్డు కొన్ని మార్పులు చేసింది. ఇందుకోసం రెండు పరిస్థితులల్లో  పాయింట్ల పంపిణీ నిబంధనలను బోర్డు వివరించింది. మొదటి పరిస్థితిలో, మొదట బ్యాటింగ్ చేసిన ‘A’ జట్టు మొదటి ఇన్నింగ్స్‌లో 98 ఓవర్లలో 398 పరుగులకు ఆలౌట్ అయిందని అనుకుందాం, అప్పుడు అది 4 బ్యాటింగ్ పాయింట్లను పొందుతుంది. ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, ఆ టీమ్  5 పెనాల్టీ పరుగులు పొందినట్లయితే, స్కోరు ఇప్పుడు 98 ఓవర్లలో 403 అవుతుంది. ఆ టీమ్  5 బ్యాటింగ్ పాయింట్లను పొందుతాడు.

రెండో పరిస్థితి ఏమిటంటే.. ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ‘ఎ’ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో 100.1 ఓవర్లలో 398 పరుగులకు ఆలౌట్ అయితే, 4 బ్యాటింగ్ పాయింట్లు ఇస్తారు.  ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు, ఆ టీమ్  5 పెనాల్టీ పరుగులు సాధిస్తే, స్కోరు 100.1 ఓవర్లలో 403 పరుగులు అవుతుంది, కానీ ఆ టీమ్ కు ఆ 5వ బ్యాటింగ్ పాయింట్ లభించదు.

మరిన్ని క్రికెట్ వార్తలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *