RGV

RGV: రమ్యకృష్ణతో ఆర్జీవీ హాట్ హారర్ థ్రిల్!

RGV: రామ్ గోపాల్ వర్మ హారర్ జోనర్‌కు తిరిగి వచ్చాడు. ‘పోలీస్ స్టేషన్ మే భూత్’ చిత్రంలో రమ్యకృష్ణ భయంకర హాట్ లుక్‌తో ఆకట్టుకుంటుంది. పోస్టర్ రిలీజ్‌తో హైప్ విపరీతంగా పెరిగిపోయింది.

రామ్ గోపాల్ వర్మ మళ్లీ హారర్ థ్రిల్లర్ జోనర్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘దెయ్యం’, ‘రాత్రి’, ‘రక్ష’, ‘మర్రి చెట్టు’ వంటి దెయ్యాలా సినిమాల తర్వాత ‘పోలీస్ స్టేషన్ మే భూత్’తో సస్పెన్స్, సైకలాజికల్ థ్రిల్ మిక్స్ చేస్తున్నాడు. పోలీస్ స్టేషన్‌లో దెయ్యం తిరగడం అనే కాన్సెప్ట్ ఆర్జీవీ మార్క్‌గా కనిపిస్తోంది. రమ్యకృష్ణ పోస్టర్ రిలీజ్‌తో షాక్ ఇచ్చింది. తిలకం, కాటుక కళ్లతో మాంత్రికురాలి లుక్ తో గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. భయంకరంగా, హాట్‌గా కనిపిస్తూ కొత్త షేడ్స్ చూపిస్తోంది. ఈ సినిమాలో మనోజ్ బాజ్‌పాయ్ పోలీస్ ఆఫీసర్‌గా నటిస్తున్నాడు. అలాగే జెనీలియా సపోర్టింగ్ రోల్‌లో కనిపిస్తుంది. ఒక దెయ్యం పోలీస్ స్టేషన్‌లో వేటాడటం అనే కాన్సెప్ట్ ఆర్జీవీ సిగ్నేచర్‌గా తెలుస్తోంది. ట్యాగ్‌లైన్ ‘చనిపోయిన వారిని మీరు అరెస్ట్ చేయలేరు’ పంచ్‌తో ఆకట్టుకుంటుంది. ఈ సినిమా కోసం హారర్ ఫ్యాన్స్ ఎక్సైటెడ్‌గా ఉన్నారు. రమ్యకృష్ణ లుక్‌తో హైప్ ఒక రేంజిలో పెరిగింది. ఈ చిత్రం హిట్ టాక్ తెచ్చుకుంటే, కచ్చితంగా ఆర్జీవీ హారర్ లెగసీని కొనసాగిస్తుందని ఫ్యాన్స్ అంచనా వేస్తున్నారు. మరి ఈ చిత్రం ఆర్జీవీ మ్యాజిక్ ని రిపీట్ చేస్తుందో లేదో చూడాలి.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *