Ramchandra rao: రాష్ట్ర రాజకీయాల్లో మరోసారి విమర్శలు వినిపించాయి. బీజేపీ నేత రాంచందర్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. “సీఎంకు కిషన్‌రెడ్డి ఫోబియా పట్టుకుంది. ప్రతీ విషయంలో కిషన్‌రెడ్డిని నిందించడం మానుకోవాలి” అని ఆయన వ్యాఖ్యానించారు.
రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దుర్భరంగా మారిందని ఆయన ఆరోపించారు. రేవంత్ ఢిల్లీకి తరచూ వెళ్లిపోతున్నా, రాష్ట్రానికి ఆ పర్యటనల ద్వారా ఎలాంటి లాభం కలుగడం లేదని రాంచందర్‌రావు ఎద్దేవా చేశారు.
కాళేశ్వరంపై ప్రభుత్వం రాసిన లేఖ ఇప్పటికే సీబీఐ దగ్గర ఉందని ఆయన తెలిపారు. ఈ విషయంపై ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు.
ఉగ్రవాదం అంశంపై మాట్లాడుతూ, ఉగ్రవాదం, వామపక్ష ఉగ్రవాదం రెండూ ఒక్కటే అని ఆయన స్పష్టం చేశారు. మావోయిస్టులతో చర్చల విషయాన్ని కేంద్రం నిర్ణయిస్తుందని తెలిపారు. గతంలో అనేకసార్లు చర్చలు జరిగినప్పటికీ, హింస తగ్గకుండా పెరిగిందని రాంచందర్‌రావు అన్నారు.