Ramayana

Ramayana: రెండు పార్టులుగా రామాయణ.. రిలీజ్ డేట్స్ ఫిక్స్

Ramayana: బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ రాముడిగా, సాయిపల్లవి సీతగా తెరకెక్కుతున్న సినిమా రామాయణ. నితీశ్ తివారి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా విడుదల తేదీని చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. 2026 దీపావళికి పార్ట్-1 రిలీజ్ చేయనున్నట్టు క్లారిటీ ఇచ్చింది. 2027 దీపావళికి రెండో భాగాన్ని రిలీజ్ చేస్తామని చెప్పింది. ఈ సినిమాలో కేజీఎఫ్ స్టార్ యష్.. రావణుడిగా నటిస్తున్నాడు. బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్, రకుల్ ప్రీత్ సింగ్, లారా దత్తా వంటి ప్రముఖ నటీనటులు కూడా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొద్దిరోజుల్లోనే ఫోటోలు కూడా లీక్ అయ్యాయి. మేకర్స్ ప్రస్తుతం ముంబైలో ఇండోర్ షూటింగ్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Prabhas: ఆ స్టార్ కిడ్స్ అందరి ఫేవరేట్ ప్రభాస్!?

Ramayana: నవంబర్ నాలుగో వారం నుంచి జరగబోయే కొత్త షెడ్యూల్ లో సాయి పల్లవిపై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తారని సమాచారం. ఈ సన్నివేశాలు సినిమాలోనే కీలకం అని, ముఖ్యంగా సాయిపల్లవి నటనను ఎలివేట్ చేసే ఈ సీన్లతో ఆమె నటన స్థాయి మరో మెట్టుకు ఎదుగుతుందనే టాక్ ఉంది. ఈ సినిమాలో వీఎఫ్ఎక్స్ కూడా భారీగా ఉండనున్నాయి. టెక్నికల్ గా అత్యంత అడ్వాన్స్ డ్ గా ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని దర్శకుడు నితేశ్ తీవారీ భావిస్తున్నారు. ఈ సినిమా కోసం ఆస్కార్ అవార్డులను గెలిచిన వీఎఫ్ఎక్స్ కంపెనీ డీఎస్ఈడీని ఆయన నియమించుకున్నారు. కాగా, సాయిపల్లవి ప్రస్తుతం తెలుగులో నాగచైతన్యకు జోడీగా తండేల్ చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల విడుదలై సూపర్ హిట్ అయిన అమరన్ చిత్రంలో సాయిపల్లవి ఆకట్టుకున్నది. ఇందులో శివకార్తికేయన్ సరసన ఆమె నటించింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *