Ram mohan Naidu: అధికారంలో ఉన్న ప్రభుత్వం విగ్రహాలను మార్చడంలో మునిగిపోయిందని టీడీపీ నేత రామ్మోహన్ నాయుడు మండిపడ్డారు. “విగ్రహాలు మాత్రమే కాదు… మనం (ప్రజలు) కూడా మారాలి” అని ప్రజలకు సంబోధించారు. గత ఐదేళ్లలో రాష్ట్రాన్ని పైశాచిక ఆనందం పొందే ప్రభుత్వంగా మార్చేశారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వ పాలనలో దళితులపై అకారణంగా కేసులు పెడుతూ, ఆత్మగౌరవాన్ని అపహరిస్తున్నారని రామ్మోహన్ నాయుడు ఆరోపించారు. “ఎస్సీలపైనే SC అట్రాసిటీ కేసులు పెట్టారని. దళితులు, బీసీలకు ధైర్యం ఇచ్చే పార్టీ తెలుగుదేశం మాత్రమే” అని స్పష్టం చేశారు.
ఇక మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, డాక్టర్ అంబేద్కర్ ఆశయాలను నెరవేర్చే దిశగా ఎన్టీఆర్, చంద్రబాబు నాయుడు పనిచేశారని కొనియాడారు. “ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వేలాది మంది విద్యార్థులకు, చిన్న వ్యాపారులకు రుణాలు అందించాం. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్‌ను కచ్చితంగా అమలు చేసి, నిధులను నేరుగా మైనారిటీ వర్గాల అభివృద్ధికి కేటాయించాం” అని చెప్పారు.
గత ప్రభుత్వం ఎస్సీ కార్పొరేషన్‌కి తాళం వేసిందని విమర్శించిన ఆయన, చంద్రబాబు ఆలోచించి తెచ్చిన P4 విధానం (పూర్తి ప్రణాళికతో పేద ప్రజలకు పరిపూర్ణ ప్రోత్సాహం) రాష్ట్ర దిశను మార్చే ఆవిష్కరణగా అభివర్ణించారు.
ప్రస్తుత ప్రభుత్వ తీరు, వైఖరిపై ప్రజలు ఆలోచించాలని, వచ్చే ఎన్నికల్లో ప్రజలే మార్పు తీసుకురావాలని ఇద్దరు నేతలు పిలుపునిచ్చారు.