Game Changer: రామ్ చరణ్ నటించిన ‘గేమ్ ఛేంజర్’ మరికొద్ది రోజుల్లో సంక్రాంతికి విడుదల కానుంది. ‘పుష్ప 2’ సినిమా విడుదల సమయంలో ఏర్పడిన సమస్యతో తెలంగాణలో స్పెషల్ షోలు రద్దు చేయడంతో ‘గేమ్ ఛేంజర్’ సినిమాకు ఇబ్బందులు ఎదురవుతున్నాయా.
హైదరాబాద్ లోని సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట జరగడంతో ఓ మహిళ మృతి చెందగా, బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఇదే కేసులో అల్లు అర్జున్ కూడా అరెస్టయ్యాడు. ఈ ఘటన తర్వాత తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బెనిఫిట్ షో సహా స్పెషల్ షోలను రద్దు చేశారు. కానీ దిల్ రాజు చేసిన వ్యాఖ్యలు అందరి దృష్టిని ఆకర్షించాయి.
గేమ్ ఛేంజర్ కూడా పెద్ద సినిమా అని.. “అన్ని పెద్ద చిత్రాల మాదిరిగానే గేమ్ ఛేంజర్‌కు కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో బెనిఫిట్ షోలు ఉంటాయి. పక్కాగా ప్లాన్ చేసి ముందుకెళ్తాం’’ అని దిల్ రాజు అన్నారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: వదిలేదే లే.. పుష్ప కు మరో షాక్!
Game Changer: నిర్మాతగా, దిల్ రాజు 2025 సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ఇంకా సంక్రాంతికి వస్తున్నాం ఈ రెండు సినిమాలతో సంక్రాంతి రిలీజ్ కి రెడీ అయ్యారు వీటితో పాటు అతను డాకు మహారాజ్‌ని కూడా డిస్ట్రిబ్యూషన్ తీసుకోని రిలీజ్ చేస్తున్నారు. ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ అవుతాయని అయన నమ్మకంగా ఉన్నాడు.
తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా దిల్ రాజు నియమితులైనందున, నిషేధాన్ని ఎత్తివేయాలని, స్టార్ హీరోస్ అభిమానుల కోసం రాత్రి, అర్ధరాత్రి షోల పద్ధతిని కొనసాగించాలని ఆయన ప్రభుత్వాన్ని అభ్యర్థించవచ్చు అని తెలుస్తుంది.
గేమ్ ఛేంజర్ సినిమాకి తమిళ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. రామ్ చరణ్ కి జోడిగా కైరా అద్వానీ నటిస్తున్నారు. ఈ సినిమా జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.