Game Changer: రామ్ చరణ్ హీరోగా, దిల్ రాజు నిర్మించిన ‘గేమ్ ఛేంజర్’ సంక్రాంతి కానుకగా జనవరి 10న జనం ముందుకు వచ్చింది. శంకర్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు డివైడ్ టాక్ వినిపిస్తోంది. అయినా కలెక్షన్స్ మాత్రం ఆశాజనకంగానే ఉన్నాయి. తొలి రోజున తమ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ. 186 కోట్ల గ్రాస్ ను వసూలు చేసిందని చిత్ర నిర్మాణ సంస్థ పేర్కొంది. ఈ సినిమాకు లభిస్తున్న ఆదరణపై చిరంజీవి, రామ్ చరణ్ భార్య ఉపాసన హర్షం వ్యక్తం చేశారు. ముఖ్యంగా అప్పన్న పాత్రలో రామ్ చరణ్ చక్కటి నటన ప్రదర్శించాడంటూ సినీ ప్రముఖులు, సాధారణ ప్రేక్షకులు అభినందిస్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ‘గేమ్ ఛేంజర్’ ఏ స్థాయిలో కలెక్షన్స్ రాబడుతుందో చూడాలి.