Dominic and the Ladies’ Purse: సీనియర్ స్టార్ హీరో మమ్ముట్టీ నటించిన తాజా చిత్రం ‘డొమినిక్ అండ్ ది లేడీస్ పర్స్’. గౌతమ్ వాసుదేవ మీనన్ తెరకెక్కించిన ఈ సినిమాలో మమ్ముట్టీ డిటెక్టివ్ పాత్ర పోషించారు. తన దగ్గరకు వచ్చిన కేసులను సమర్థవంతంగా పరిష్కరించే వినోదాత్మక అపరాథ పరిశోధకుడిగా ఆయన కనిపించబోతున్నారు. ‘డొమినిక్ డిటెక్టివ్ వస్తున్నాడు’ అంటూ ఇటీవల ఈ సినిమా ట్రైలర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 23న సినిమా థియేటర్ల లోకి రాబోతోంది. ఇందులో గోకుల్ సురేశ్, సిద్ధిక్ కీలక పాత్రలు పోషించారు.