Ram Charan RC16

Ram Charan RC16: రామ్ చరణ్- బుచ్చిబాబు మూవీ బ్యాక్ డ్రాప్ ఇదా..?

Ram Charan RC16: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాన్వీ కపూర్ హీరోయిన్ గా దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇది చరణ్ కెరీర్ లో 16వ సినిమాగా తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ అంతా ఫుల్ స్వింగ్ లో జరుగుతుంది. ఈ సినిమాని దర్శకుడు బుచ్చిబాబు ఒక సాలిడ్ స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిస్తున్నారని తెలిసిందే.తాజాగా ఈ సినిమా పై క్రేజీ లీక్ బయటకి వచ్చింది. ఈ సినిమాకి సినిమాటోగ్రఫీ అందిస్తున్న రత్నవేలు షూట్ పై అప్డేట్ ఇస్తూ పవర్ క్రికెట్ అంటూ ఒక లైన్ ఇవ్వడం జరిగింది. దీనితో ఈ సినిమా క్రికెట్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతోందని సోషల్ మీడియాలో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఈ సినిమాలో రామ్ చరణ్ పవర్ ఫుల్ బ్యాట్స్ మెన్ లా కనిపిస్తాడని తెలుస్తుంది. పైగా దీనికి సంబంధించి సీన్ ఒకటి ఆల్రెడీ షూట్ చేసినట్టు కూడా తెలుస్తోంది. మరి చూడాలి ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫ్యాన్స్ ని ఏ విధంగా ఆకట్టుకుంటుందో.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *