Ram Charan

Ram Charan: ఒకటి నుండి బరిలోకి రామ్ చరణ్!

Ram Charan: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ చేదు అనుభవం నుండి బయటకొచ్చారు. తిరిగి తన కొత్త సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నారు. సానా బుచ్చిబాబు దర్శకత్వంలో ప్రస్తుతం రామ్ చరణ్‌ ఓ క్రీడానేపథ్య చిత్రంలో నటిస్తున్నారు. ఈ పిరియాడికల్ డ్రామా షూటింగ్ ఇప్పటికే మొదలైంది. మైసూర్ లో తొలి షెడ్యూల్ ను పూర్తి చేసుకుంది. ఈ సినిమా కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను వేశారు. రాత్రి సమయాలలో చేయాల్సిన షూటింగ్ ను ఈ సెట్ లో ఫిబ్రవరి 1 నుండి మొదలు పెట్టబోతున్నారు. రామ్ చరణ్‌ తో పాటు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్న వారంతా ఇందులో పాల్గొనబోతున్నారు. జాన్వీ కపూర్ నాయికగా నటిస్తున్న ఈ సినిమాకు ఎ.ఆర్. రెహమాన్ సంగీతం అందిస్తుండగా, రత్నవేలు సినిమాటోగ్రాఫర్ గా చేస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *