Parliament: 18వ లోక్‌సభ శీతాకాల సమావేశాలు శుక్రవారం (డిసెంబర్ 20)తో ముగిశాయి. ఈ సెషన్ నవంబర్ 25 నుండి ప్రారంభమైంది. మొత్తం సెషన్‌లో 20 సమావేశాలు జరిగాయి. ఉభయ సభల్లో (లోక్‌సభ, రాజ్యసభ) దాదాపు 105 గంటల పాటు చర్చలు జరిగాయి. సెషన్‌లో లోక్‌సభ ప్రొడక్టివిటీ 57.87%, రాజ్యసభ ప్రొడక్టివిటీ 41% గా ఉంది. మొత్తం నాలుగు బిల్లులను సభలో ప్రవేశపెట్టారు. అయితే, ఏ బిల్లు కూడా పాస్ కాలేదు. ఒకే దేశం, ఒకే ఎన్నిక కోసం ప్రవేశపెట్టిన 129వ రాజ్యాంగ (సవరణ) బిల్లుపై ఎక్కువగా చర్చ జరిగింది.
ఇది కూడా చదవండి: Mendori Forest: అడవిలో లాక్ చేసిన కారు.. అద్దాలు పగలగొట్టి చెక్ చేస్తే మైండ్ బ్లాక్
Parliament: బిల్లును 39 మంది సభ్యుల జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపారు. ఈ కమిటీలో లోక్‌సభ నుంచి 27 మంది, రాజ్యసభ నుంచి 12 మంది ఎంపీలు ఉన్నారు. రాజస్థాన్‌లోని పాలి నుంచి బీజేపీ ఎంపీ పీపీ చౌదరి జేపీసీ చైర్మన్‌గా నియమితులయ్యారు. తదుపరి పార్లమెంట్ సమావేశాల చివరి వారం మొదటి రోజున కమిటీ తన నివేదికను లోక్‌సభకు సమర్పించాల్సి ఉంటుంది.
అదానీ సమస్యపై ఉత్కంఠతో సభ ప్రారంభమైంది. అప్పుడు ప్రతిపక్ష ఎంపీలు కూడా మణిపూర్ – రైతుల సమస్యను లేవనెత్తారు. సభ ముగిసే సమయానికి అంబేద్కర్ అంశంపై పెద్ద ఎత్తున దుమారం చెలరేగింది. డిసెంబర్ 19న ఈ వ్యవహారం ఓ కొలిక్కి వచ్చింది. ఇద్దరు బీజేపీ ఎంపీలకు గాయాలయ్యాయి. దీంతో కాంగ్రెస్ నేత రాహుల్‌పై ఆరోపణలు చేశారు. ఆయనపై ఎఫ్ఐఆర్ నమోదైంది.