Dadasaheb Phalke Biopic: భారత సినిమా పితామహుడు దాదాసాహెబ్ ఫాల్కే జీవితకథ తెరపైకి రానుంది… కానీ ఒకటిగా కాదు, రెండు సినిమాలుగా రానుంది. దిగ్గజ దర్శకులు ఎస్.ఎస్. రాజమౌళి, రాజ్‌కుమార్ హిరాణీ ఈ బయోపిక్‌లతో హైవోల్టేజ్ గా ఢీకొట్టనున్నారు. రాజమౌళి తన చిత్రం ‘మేడ్ ఇన్ ఇండియా’లో భాగంగా ఎన్టీఆర్‌ను ఫాల్కేగా ప్రజెంట్ చేయనున్నాడు.రాజమౌళి వారసుడు కార్తికేయ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే హాట్ టాపిక్‌గా మారింది. మరోవైపు హిరాణీ అమీర్ ఖాన్‌తో దాదాసాహెబ్ ఫాల్కే బయోపిక్‌ను రూపొందిస్తున్నారు. అమీర్ తన ‘సీతారే జమీన్ పర్’ రిలీజ్ తర్వాత హిరాణీతో ఫాల్కే బయోపిక్‌లో నటించనున్నారు. కానీ, ఈ లెజెండ్ జీవితకథ హక్కులు ఎవరి వద్ద ఉన్నాయన్నది ఇంకా మిస్టరీగా మిగిలింది. ఒకే సమయంలో ఇద్దరు స్టార్ డైరెక్టర్లు, టాప్ హీరోలతో ఈ సినిమాలు తెరకెక్కితే ప్రేక్షకులు కన్ఫ్యూజ్ కావచ్చు. రాజమౌళి, హిరాణీ వేర్వేరు కోణాల్లో ఫాల్కేను చూపిస్తే ఈ బయోపిక్‌లు బాక్సాఫీస్‌ను షేక్ చేయడం ఖాయం. ఈ హక్కులపై క్లారిటీ కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
 
							
