Mahesh Babu: భారతీయ చలనచిత్ర పరిశ్రమకే గర్వకారణంగా నిలిచిన దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి. ఆస్కార్ అవార్డుతో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు అంతర్జాతీయ గుర్తింపును అందించిన ఈ దర్శక ధీరుడు నేడు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.
టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మహేష్ బాబు రాజమౌళితో కలిసి దిగిన ఒక ప్రత్యేకమైన ఫోటోను పంచుకున్నారు. “ఇండస్ట్రీలో ఉన్న ఒకేఒక్క దర్శకధీరుడు రాజమౌళికి పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరు తీసే ప్రతి సినిమా అద్భుతమే. మీ నుంచి మరో అద్భుతం త్వరలోనే వస్తుందని ఆశిస్తున్నాం” అని మహేష్ బాబు శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఫోటోలో మహేష్ #SSMB29 సినిమా లుక్లో కనిపించడం, ఆ ప్రాజెక్ట్ గురించి ప్రస్తావించడం అభిమానుల మధ్య వైరల్గా మారింది.
Also Read: Kantara Chapter 1: చరిత్ర సృష్టించిన కాంతార చాప్టర్ 1!
ప్రస్తుతం మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్లో #SSMB29 అనే భారీ ప్రాజెక్ట్ రూపొందుతోంది. ఈ సినిమా అమెజాన్ అడవుల నేపథ్యంపై సాగే అడ్వెంచర్ కథగా తెరకెక్కనుంది. ఈ చిత్రంలో మహేష్ సరసన అంతర్జాతీయ నటి ప్రియాంక చోప్రా కథానాయికగా నటించనున్నారు. అంతేకాకుండా, కథలో అవసరమైన మేరకు పలువురు విదేశీ నటులు కూడా కనిపించనున్నారు. ఈ సినిమాకు ‘వారణాసి’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. సినిమా పేరును నవంబర్ 16న అధికారికంగా ప్రకటించే అవకాశం ఉందని సమాచారం. భారతీయ భాషలతో పాటు, ఈ సినిమాను విదేశీ భాషల్లో కూడా భారీ స్థాయిలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
Wishing the one and only @ssrajamouli a very Happy Birthday…The best is always yet to come😍😍😍..Have a great one sir 🤗🤗🤗♥️♥️♥️ pic.twitter.com/U3tcyJIbgv
— Mahesh Babu (@urstrulyMahesh) October 10, 2025