Raja Saab Trailer Update: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న ‘రాజా సాబ్’ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మారుతీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం 2026 జనవరి 9న సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటివరకు యాక్షన్, లవ్ స్టోరీ, పీరియాడిక్ జానర్స్‌లో కనిపించిన ప్రభాస్, ఈసారి కెరీర్‌లో ఫస్ట్ టైం హారర్-కామెడీ బ్యాక్డ్రాప్ లో కనిపించబోతున్నారు.
మారుతీ స్టైల్‌లో కామెడీ, హారర్ మిక్స్ అయితే మాస్, ఫ్యామిలీ ఆడియెన్స్‌ని ఆకట్టుకుంటుందని ఫిల్మ్ నిపుణులు అంటున్నారు. తాజాగా సూపర్ హిట్ మిరాయ్ ఇచ్చిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను దాదాపు రూ.500 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది.
ఇది కూడా చదవండి: Suhas: మరోసారి తండ్రయిన హీరో సుహాస్.. ఫొటో చూశారా?
దసరా పండుగ సందర్భంగా మూవీ టీం ఒక క్రేజీ అప్డేట్ ఇచ్చింది. ఫ్యాన్స్ ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న ‘రాజా సాబ్’ ట్రైలర్‌ను సెప్టెంబర్ 29 సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ వార్తతో ప్రభాస్ అభిమానుల్లో సంబరాలు మొదలయ్యాయి.
సినిమాలో నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రద్దీ కుమార్ హీరోయిన్స్‌గా నటిస్తుండగా.. మ్యూజిక్ డైరెక్టర్ కూడా తన మ్యూజిక్‌తో మరోసారి మ్యాజిక్ చేయడానికి సిద్ధమవుతున్నారు.
ఇక ప్రభాస్ కెరీర్‌లో ఫస్ట్ టైం వస్తున్న ఈ హారర్-కామెడీ జానర్ సినిమా ఎలాంటి ఫలితం ఇస్తుందో.. బాక్సాఫీస్ వద్ద ఎంత హైప్ క్రియేట్ చేస్తుందో చూడాలి.
#TheRajaSaabTrailer 🙌🏿 🦖 #Prabhas Annnaaaa❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥❤️🔥
Racchhhhhhhhhhaaaaaaaa raccccchaaaaaaaa !! 🔥S-E-P 29 6 P-M 💥💥💥💥💥💥💥💥 pic.twitter.com/r3ISuFSnVd
— thaman S (@MusicThaman) September 28, 2025