Rahul Gandhi: కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్‌గాంధీ, దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో ఎన్నికల్లో భారీ అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ సంచలనం సృష్టించారు. ముఖ్యంగా హర్యానా రాష్ట్రంలో ఏకంగా 25 లక్షల ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు. ఈ ఓట్ల చోరీకి సంబంధించిన వివరాలను ‘హెచ్ ఫైల్స్’ పేరుతో బయటపెట్టినట్లు తెలిపారు.
హర్యానాలో ఓట్ల విషయంలో భారీ తేడాలు కనిపించాయని, తమకు దీనిపై అనేక ఫిర్యాదులు అందాయని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. పోలైన పోస్టల్ ఓట్లకు, ఎన్నికల ఫలితాలకు మధ్య వ్యత్యాసం ఉందని ఆయన తెలిపారు. కేవలం హర్యానాలోనే కాకుండా, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర రాష్ట్రాల్లో కూడా ఓట్ల చోరీ జరిగిందని ఆయన ఆరోపించారు.
ఈ అవకతవకలకు ఉదాహరణగా, హర్యానాలో ఒకే యువతికి పది బూత్‌లలో కలిపి 22 ఓట్లు ఉన్నట్లు గుర్తించామని రాహుల్ గాంధీ తెలిపారు. ఆ యువతి బ్రెజిల్‌కు చెందిన మోడల్‌గా గుర్తించామని కూడా ఆయన పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు జరిపించాలని కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు.

