Rahul Gandhi: మూడు వ్యవసాయ చట్టాలపై బాలీవుడ్ నటి, భారతీయ జనతా పార్టీ ఎంపీ కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలపై రాహుల్ గాంధీ ఫైరయ్యారు. 2021లో రద్దు చేసిన మూడు వ్యవసాయ చట్టాలను తిరిగి తీసుకురావాలని పిలుపునిస్తూ ఎంపీ కంగనా చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది.
తాజాగా ఈ విషయంపై రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోదీని వివరణ కోరారు. “ప్రభుత్వ విధానాన్ని ఎవరు నిర్ణయిస్తారు?. బీజేపీ ఎంపీ లేక ప్రధాని మోడీనా?. 700 మందికి పైగా రైతులు.. ముఖ్యంగా హర్యానా, పంజాబ్‌ల రైతులు బలిదానం చేసినా.. బీజేపీ నాయకులు సంతృప్తి చెందలేదు” అని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఎక్స్‌లో తాను మాట్లాడిన వీడియోను రాహుల్ గాంధీ పోస్ట్ చేశారు.
Also Read: ఢిల్లీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన అతిశీ
Rahul Gandhi: రైతులపై బీజేపీ ఏ కుట్ర చేసినా.. దానిని ఇండియా కూటమి విజయవంతం చేయనివ్వదని హెచ్చరించారు. రైతులకు నష్టం కలిగించే చర్య ఏదైనా తీసుకుంటే మోదీ మరోసారి క్షమాపణ చెప్పాల్సి వస్తుందని రాహుల్ గాంధీ అన్నారు.
Rahul Gandhi: ఇదిలావుంటే, సాగు చట్టాలపై చేసి వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులతోపాటు సొంత నేతల నుంచి కూడా విమర్శలు రావడంతో కంగనా వెనక్కి తగ్గింది. తన వ్యాఖ్యలపై క్షమాపణ కోరుతున్నట్లు సోషల్ మీడియాలో పేర్కొంది. తన వ్యాఖ్యలను వెనక్కి తీపసుకుంటున్నానని చెప్పింది. ఆ వ్యాఖ్యలు తన వ్యక్తిగతమని.. వాటితో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని కంగనా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది.