Rahul Gandhi

Rahul Gandhi: రాహుల్ గాంధీ సహా విపక్ష నేతల అరెస్ట్..!

Rahul Gandhi: లోక్‌సభ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయంటూ ఇండియా కూటమి నేతలు చేపట్టిన నిరసన ర్యాలీ దేశ రాజధాని ఢిల్లీలో ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల సంఘం కార్యాలయానికి బయలుదేరిన ప్రతిపక్ష ఎంపీలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఈ రోజు ఉదయం, కాంగ్రెస్ నాయకులు రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ సహా పలువురు విపక్ష ఎంపీలు పార్లమెంట్ భవనం నుంచి ఎన్నికల సంఘం ఆఫీసు వైపు ర్యాలీగా బయలుదేరారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఓట్ల చోరీ జరిగిందని, దీనిపై ఎన్నికల సంఘం సమాధానం చెప్పాలని వారు డిమాండ్ చేశారు.

అయితే, ముందస్తు అనుమతి లేని కారణంగా పోలీసులు వారి ర్యాలీని అడ్డుకున్నారు. సంసద్ మార్గ్ ప్రాంతంలో బారికేడ్లు పెట్టి రోడ్డును మూసివేశారు. దీంతో ఎంపీలు రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు. కొందరు బారికేడ్లు ఎక్కి దూకి ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు అప్రమత్తమయ్యారు.

ఈ సందర్భంగా ఎన్నికల సంఘం 30 మంది నేతలను మాత్రమే తమను కలవడానికి అనుమతిస్తామని తెలిపింది. అయితే, ఇండియా కూటమి నేతలు దీనికి అంగీకరించలేదు. అందరం కలిసే వెళ్తామని పట్టుబట్టారు. ఈ క్రమంలో పోలీసులు రాహుల్ గాంధీ, ఖర్గే, అఖిలేష్ యాదవ్ సహా పలువురు ఎంపీలను అరెస్ట్ చేసి, ప్రత్యేక బస్సుల్లో పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఓట్ల గోల్‌మాల్‌పై ఇండియా కూటమి ఆరోపణలు:
ఈ ఎన్నికల్లో ఓట్ల గోల్‌మాల్ జరిగిందని ఇండియా కూటమి ఆరోపిస్తోంది. బిహార్‌లో ఓటరు జాబితా ప్రత్యేక సవరణపై కూడా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొత్త ఓటర్ల కోసం వాడే ‘ఫామ్-6’ను వృద్ధులకు కూడా పదేపదే వాడుతున్నారని రాహుల్ గాంధీ ఆరోపించారు. దీనిపై ఎన్నికల సంఘం సరైన వివరణ ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. శకున్ రాణి అనే మహిళ ఓటుకు సంబంధించిన వివరాలను కూడా రాహుల్ ఎన్నికల సంఘానికి సమర్పించారు. ఇలాంటి అనేక ఓట్ల గోల్‌మాల్ బయటపడుతుందని తెలిసే ఎన్నికల సంఘం డిజిటల్ డేటా ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *