Rahul Gandhi: తన సోదరి, ఎంపీ ప్రియాంకాగాంధీ భర్త రాబర్ట్ వాద్రా విషయంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ స్పందించారు. మనీలాండరింగ్ కేసులో రాబర్ట్ వాద్రా పేరును ఈడీ చార్జిషీట్‌లో చేర్చడంపై ఆయన అభ్యంతరాలను వ్యక్తంచేశారు. తన భావను కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం గత కొన్నేళ్లుగా వేధిస్తున్నదని ఒక ప్రకటనలో ఆరోపించారు.
Rahul Gandhi: ఈడీ చార్జిషీట్ రాజకీయ ప్రేరేపితమేనని రాహుల్‌గాంధీ విమర్శించారు. ఈ దాడులను ఎదుర్కొంటున్న రాబర్ట్, ప్రియాంక, వారి పిల్లలకు మద్దతుగా తాను నిలబడతానని స్పష్టంచేశారు. వారు ధైర్యంగా ఈ ఒత్తిడిని తట్టుకుంటారని భావిస్తున్నట్టు భరోసా ఇచ్చారు. చివరకు నిజమే గెలుస్తుందని ధీమా వ్యక్తంచేశారు.
Rahul Gandhi: ఈడీ దాఖలు చేసిన చార్జిషీట్‌లో హరియానా గురుగ్రామ్‌లోని షికోపూర్ గ్రామంలో 2008లో జరిగిన 3.53 ఎకరాల భూ లావాదేవీలోని మనీలాండరింగ్ కేసు విషయాలు ఉన్నాయి. ఈ కేసులో రాబర్ట్ వాద్రా సంస్థ స్కైలైట్ హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ తోపాటు ఇతర వ్యక్తులు, సంస్థలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. ఈ కేసులో వాద్రాకు చెందిన రూ.37.64 కోట్ల విలువైన 43 ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది.

