Prashanth Neel – Prasanth Varma: డైరెక్టర్స్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న కొందరు ఇతర వ్యాపకాలవైపు దృష్టి పెట్టి చెడ్డ పేరు తెచ్చుకుంటున్నారు. ఆ మధ్య దర్శక నిర్మాత మారుతీ… కొన్ని సినిమాలకు కథలను ఇవ్వడంతో పాటు మరికొన్ని సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరించారు. లాభాపేక్షతోనో మొహమాటంతోనో ఆయన ఆ పని చేసినా… మొత్తంగా మారుతీ ఇమేజ్ అయితే డ్యామేజ్ అయ్యింది. అలానే ఆ మధ్య దర్శకుడు అనిల్ రావిపూడి ఓ సినిమాకు ప్రెజెంటర్ గా వ్యవహరించి అది కాస్తా ఫ్లాప్ కావడంతో తప్పు తెలుసుకున్నారు. తాజాగా స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ‘బఘీర’ మూవీకి కథను అందించారు. అది కాస్తా అట్టర్ ఫ్లాప్ అయ్యింది. అలానే ‘హను-మాన్’తో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రశాంత్ వర్మ… శుక్రవారం విడుదలైన ‘దేవకీ నందన వాసుదేవ’కు కథను ఇచ్చారు. కానీ ఇది ఫ్లాప్ చిత్రాల జాబితాలో చేరిపోయింది. తగదునమ్మా అంటూ కోటికో, రెండు కోట్లకో ఆశపడి ఇలాంటి చెడ్డపేరు వీళ్ళు ఎందుకు తెచ్చుకోవడం అంటున్నారు సినిమా జనం.