Andhra University

Andhra University: ఆంధ్రా యూనివర్సిటీలో ర్యాగింగ్ కలకలం

Andhra University: ఆంధ్రా యూనివర్శిటీలో ర్యాగింగ్ కలకలం రేగింది. ఆర్కిటెక్చర్ మొదటి ఏడాది చదువుతున్న విద్యార్థినులను సెకండియర్ విద్యార్థినులు ఇబ్బంది పెట్టారు. హాస్టల్‌లో డ్యాన్సులు వేయాలంటూ ర్యాగింగ్ చేశారు. అంతేకాకుండా ఈ తతంగాన్నంతా వీడియోలు తీసి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేశారు. తమకు డ్యాన్స్ రాదని చెప్తే అబ్బాయిల దగ్గరకు వెళ్లి నేర్చుకుని రమ్మని సీనియర్లు ఇబ్బంది పెట్టినట్లు బాధితులు వాపోయారు.

ర్యాగింగ్ విషయాన్ని ప్రొఫెసర్ల దృష్టికి తీసుకెళ్తే సీనియర్ల తమను మరింత ఇబ్బందులకు గురి చేస్తారేమో అని జూనియర్లు ఆందోళనకు గురయ్యారు. దిక్కుతోచని స్థితిలో కొందరు విద్యార్థినులు మీడియాను ఆశ్రయించడంతో అసలు విషయం బయటకు వచ్చింది. 3 రోజుల క్రితం జరిగిన ఈ ఘటన తాజాగా వెలుగుచూడడంతో యూనివర్శిటీ యాజమాన్యం విచారణ జరిపి చర్యలు చేపట్టింది. క్రమశిక్షణ చర్యల్లో భాగంగా 10 మంది విద్యార్థినులను 15 రోజుల పాటు సస్పెండ్ చేసింది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *