Rafael Nadal

Rafael Nadal: స్పెయిన్ బుల్ పైనే అందరి దృష్టి.. డేవిస్ కప్ బరిలో నడాల్ దిగుతాడా..? లేదా..?

Rafael Nadal: డేవిస్ కప్ తో టెన్నిస్ కెరీర్ ప్రారంభించి.. . డేవిస్ కప్ మ్యాచ్ తోనే టెన్నిస్ కు ముగింపు పలుకుతానని నడాల్ చెప్పడంతో టెన్నిస్ లో ఉన్నత శిఖరాలకు ఎదిగిన లెజెండ్ రఫెల్ నడాల్ పై అందరి దృష్టి పడింది డేవిస్‌కప్‌లో స్పెయిన్, నెదర్లాండ్స్‌ మధ్య క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్ సందర్భంగా గాయాలు వేధిస్తుండగా.. పూర్తి ఫిట్ నెస్ లేకపోతే బరిలోకి దిగను అన్న నడాల్ మాటలతో   ఈ పోరులో విజేత ఎవరు అన్నదాని గురించి ఎవరూ పెద్దగా ఆలోచించడం లేదు.  నడాల్ బరిలోకి దిగుతాడా? లేదా ? అన్న విషయంపైనే చర్చ సాగుతోంది.

డేవిస్‌కప్‌లో స్పెయిన్, నెదర్లాండ్స్‌ మధ్య జరిగే  క్వార్టర్‌ఫైనల్‌ మ్యాచ్ కోసం టెన్నిస్ ఫ్యాన్స్ ఉత్కంఠగా వెయిట్ చేస్తున్నారు. ఈ టోర్నీతో టెన్నిస్ కు గుడ్ బై చెబుతున్నట్లు 38 ఏండ్ల నడాల్ వెల్లడించడంతో చివరిగా తమ ఫేవరెట్‌ ఆటగాడి ఆటను చూద్దామని అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ రఫెల్ నడాల్  మంగళవారం ఆరంభమయ్యే ఈ టెన్నిస్‌ దిగ్గజం బరిలో దిగుతాడా లేదా అన్నదానిపైనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే  స్పెయిన్‌-డచ్‌ క్వార్టర్‌ఫైనల్‌కు ఆతిథ్యమిచ్చే జోస్‌ మారియా మార్టిన్‌ కోర్టు లో పూర్తి టికెట్లన్నీ ఇప్పటికే అమ్ముడుపోయాయి. అయితే పూర్తి ఫిట్ నెస్, గెలిచే సామర్థ్యం లేకుంటే బరిలోకి దిగను అని నడాల్ ప్రకటించడంతో అతను ఆడతాడా? లేదా అనే విషయంలో సందిగ్ధత నెలకొంది.

ఇది కూడా చదవండి: India vs Japan Hockey: ఆసియా ఛాంపియన్స్ హాకీ ట్రోఫీ సెమీస్ లో జపాన్ తో భారత్ ఢీ

Rafael Nadal: నెదర్లాండ్స్‌తో పోరులో  సింగిల్స్‌తో పాటు డబుల్స్‌ కూడా నడాల్ ఆడాల్సి ఉంది.  డబుల్స్‌లో కార్లోస్‌ అల్కరాస్‌తో  జతగా ఆడనున్నాడు. మరి అతడు సింగిల్స్‌లో ఆడతాడా? లేక డబుల్స్‌కే పరిమితమవుతాడా అనేది వేచి చూడాల్సిందే. ఒకవైపు డేవిస్ కప్ మ్యాచ్ లో ఆడుతున్నారా? లేదా? అని  నాదల్‌ను ప్రశ్నించగా.. ఈ ప్రశ్నకు  మా కెప్టెన్‌ సమాధానం చెప్పాలంటున్నాడు.  స్పెయిన్‌ నాన్‌ ప్లేయింగ్‌ కెప్టెన్‌ డేవిడ్‌ ఫెరర్‌ కూడా రఫా ఆడే విషయంపై స్పష్టత ఇవ్వక పోవడంతో ఉత్కంఠ పెరుగుతోంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *