Rabis Death:

Rabis Death: రేబిస్ వ్యాధితో చికిత్స పొందుతూ మ‌రో బాలిక మృతి

Rabis Death:వీధి కుక్క‌లు క‌ర‌వ‌డంతో రేబిస్ వ్యాధి సోకిన బాలిక చికిత్స పొందుతూ క‌న్నుమూసింది. నిజామాబాద్ జిల్లా బాల్గొండ‌కు ల‌క్ష‌ణ (10) అనే బాలిక‌ను నెల‌రోజుల క్రితం ఓ వీధి కుక్క క‌రిచింది. భ‌యంతోపాటు ఏమీ కాదులే అనుకున్న‌దో ఏమో కానీ, ఈ విష‌యాన్ని త‌న ఇంటిలో ఆ బాలిక చెప్ప‌లేదు. అయితే మూడు రోజుల క్రితం వితంగా ప్ర‌వ‌ర్తిస్తుండ‌టంతో కుటుంబ స‌భ్యులు ఆసుప‌త్రికి త‌ర‌లించారు.

Rabis Death:వైద్యులు ఆ బాలిక‌కు స‌మీపంలోని ఓ ఆసుప‌త్రిలో వైద్య ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా, రేబిస్ వ్యాధి సోకిన‌ట్టు గుర్తించారు. మెరుగైన వైద్యం కోసం ఆ బాలిక‌ను హైద‌రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆసుప‌త్రికి త‌ర‌లించారు. అక్క‌డే చికిత్స పొందుతూ ఆ బాలిక మృతి చెందింది. దీన్నిబ‌ట్టి స‌మాజంలో రేబిస్ వ్యాధి ప్ర‌మాదాన్ని గుర్తించాల‌ని ప‌లువురు హెచ్చ‌రిస్తున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *