Hyderabad: హైదరాబాద్‌లోని బాలానగర్ విమల్ థియేటర్ వద్ద ‘పుష్ప 2’ సినిమా టికెట్ల విషయంలో పెద్ద గొడవ జరిగింది. ఈ రోజుతో ‘పుష్ప 2’ సినిమా విడుదలై సరిగ్గా ఒక సంవత్సరం పూర్తయిన సందర్భంగా, ఈ థియేటర్‌లో మళ్లీ ఆ సినిమాను ప్రదర్శించారు. సినిమాపై అభిమానం ఉన్న ఫ్యాన్స్ పెద్ద సంఖ్యలో థియేటర్ దగ్గరకు వచ్చారు.
అయితే, చాలా మందికి టికెట్లు దొరకకపోవడంతో అభిమానులు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు. టికెట్లు దక్కని ఫ్యాన్స్, అక్కడి ఉన్న కొందరిపై కోపం చూపించారు. ఈ గొడవ కాస్తా ముదిరి, రెండు వర్గాలకు చెందిన అభిమానులు ఒకరిపై ఒకరు పొట్టుపొట్టు కొట్టుకున్నారు. ఈ ఘర్షణ దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అభిమానం పేరుతో జరిగిన ఈ గొడవ అందరినీ ఆశ్చర్యపరిచింది.
‘పుష్ప 2’కి ఏడాది: అల్లు అర్జున్ భావోద్వేగ పోస్ట్
మరోవైపు, ‘పుష్ప 2’ సినిమా విడుదలై ఏడాది అయిన సందర్భంగా హీరో అల్లు అర్జున్ సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. “మా జీవితంలో ‘పుష్ప 2’ అనేది దాదాపు ఐదేళ్లపాటు సాగిన ఒక మర్చిపోలేని ప్రయాణం. ఈ సినిమాపై ప్రేక్షకులు చూపించిన ప్రేమ, అభిమానం మాలా మరింత ధైర్యాన్ని పెంచింది,” అని ఆయన అన్నారు.
“ఈ సినిమాను ఇంత పెద్ద విజయం చేసిన ప్రతి ఒక్కరికీ మేము ఎప్పటికీ కృతజ్ఞులమై ఉంటాం. ఇంత గొప్ప టీంతో కలిసి పనిచేయడం నాకు దక్కిన పెద్ద గౌరవంగా భావిస్తున్నాను,” అని అల్లు అర్జున్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు. ఒకవైపు హీరో ఆనందాన్ని వ్యక్తం చేస్తుంటే, మరోవైపు అభిమానులు టికెట్ల కోసం కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

