Pushpa 2 Kissik song

Pushpa 2 Kissik song: కిస్సిక్ సాంగ్… అది అదే… ఇది ఇదే!

Pushpa 2 Kissik song: ‘పుష్ప-2’ సినిమా నుండి అల్లు అర్జున్, శ్రీలీల డాన్స్ చేసిన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ విడుదల కాగానే చాలామంది పెదవి విరిచారు. ‘పుష్ప’ మూవీలో ఊ అంటావా మావా ఊ ఊ అంటావా మావా’తో పోల్చుతూ ఆ స్థాయిలో ఇది లేదని అనేశారు. చిత్రం ఏమంటే… ఈ పాట మీద నెగెటివిటీ స్ర్పెడ్ అయినా… నెటిజన్స్ మాత్రం దీనిని విపరీతంగా చూసేశారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాతలే స్వయంగా సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ‘కిస్సిక్’ సాంగ్ దక్షిణాదిలో 24 గంటల్లో అత్యధిక వ్యూస్ దక్కించుకున్న పాటగా నిలిచిందని చెప్పారు. గతంలో ఉన్న హయ్యెస్ట్ వ్యూస్ రికార్డ్ ను ‘పుష్ప-2’లోని కిస్పిక్ సాంగ్ కేవలం 18 గంటల్లో బ్రేక్ చేసిందని తెలిపారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Tharun Bhascker: మలయాళ రీమేక్, ‘ఈ నగరానికి ఏమైంది 2’తో తరుణ్!?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *